దసరా వేళ TGSRTC బంపరాఫర్, ఇంటి వద్దే ప్రయాణీకుల పికప్ - వీరికి వర్తింపు..!!
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల కు వెసులుబాటు కల్పిస్తూ.. ఆదరణ మరింత పెరిగేలా కొత్త ఆలోచనలు చేస్తోంది. అందులో భాగంగా గ్రూపు బుకింగ్ చేసుకునే ప్రయాణీకుల ఇంటి వద్దకే బస్సు పంపి వారిని పికప్ చేసుకునే విధంగా తెలంగాణ ఆర్టీసీ కొత్త ఆఫర్ అందిస్తోంది. కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారు ఒకే ప్రాంతానికి ప్రయాణించాలనుకునే వారికి ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం బుకింగ్ కోసం కీలక అంశాలను వెల్లడించింది.
దసరా వేళ తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్ అందిస్తోంది. ఎక్కువమంది ప్రయాణికులుంటే ఇంటి వద్దకే బస్సులు పంపిస్తామని ప్రకటించింది. దీని వల్ల బస్టాండ్ వరకు వచ్చి బస్సుల కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉండే అవసరం లేకుండా ఈ సదుపాయం అందుబాటులోకి తెస్తోంది. ఈ నిర్ణయంతో కుటుంబం సభ్యులతో కలిసి ఊర్లకు వెళ్లే వారికి ప్రయోజనం కలగనుంది. ఒకే ప్రాంతా నికి వెళ్లావారు 30 మంది ఉండి, ముందే కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే ఇంటి వద్దకే బస్సు పంపి స్తామని ఆర్టీసీ వెల్లడించింది. ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణ సౌకర్యం అందించేలా ఈ నిర్ణయం తీసుకన్నట్లు స్పష్టం చేసింది. దీని వల్ల ప్రయాణికులకు సమయం, డబ్బులు ఆదా కానున్నాయి. ఇంటి వద్దకే బస్సు రావడం వల్ల బస్సు మిస్ అవుతుందనే టెన్షన్ ఉండదు. ఈ బస్సులు బుక్ చేసుకునేందుకు ప్రత్యేక నెంబర్లను ఏరియాల వారీగా ఆర్టీసీ విడుదల చేసింది.

ఆర్టీసీ తాజా నిర్ణయంతో ప్రయాణికులకు సమయం, ఆటో, టాక్సీ ఖర్చులు ఆదా అవ్వడమే కాకుండా బస్సు మిస్ అవుతుందనే ఆందోళన ఉండదు. విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాలేజీలు, హాస్టళ్ల వద్ద నుంచే నేరుగా ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేక బస్సు బుకింగ్ కోసం సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఏఎస్‌రావు నగర్, తార్నాక, ఉప్పల్, రేతిఫైల్: 99592 26142 (సికింద్రాబాద్ డీఆర్‌ఎం) ను సంప్రదించాలి. అదే విధంగా
కూకట్‌పల్లి, మియాపూర్, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, బాలానగర్, పటాన్‌చెరు, బీరంగూడ, దుండిగల్: 99562 26148 కాంటాక్టర్ చేయాలి. దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, బడంగ్‌పేట్, ఆదిభట్ల, మిధాని, సరూర్‌నగర్: 99892 26136 నెంబర్లను సంప్రదించటం ద్వారా ప్రయాణికులు తమ ఇంటి వద్దకే ప్రత్యేక ఆర్టీసీ బస్సు వచ్చే విధంగా సమాచారం పొందవచ్చని అధికారులు వెల్లడించారు.













Click it and Unblock the Notifications
