శ్రీశైలం భక్తులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, ఇక నుంచి..!!
తెలంగాణ ఆర్టీసీ వరుసగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు ఆసక్తి కర ప్రకటనలు చేస్తోంది. పండుగ సమయంలో పలు ప్రాంతాలకు వెళ్లే బస్సుల టికెట్ ధరల పైన రాయితీ ప్రకటించిన సంస్థ.. ఇప్పుడు తాజాగా శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం మరో నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి శ్రీశైలం వెళ్లే ప్రయాణీకులకు మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎండీ సజ్జనార్ కీలక అంశాలను వెల్లడించారు.
తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే వారికి శుభవార్త అందించింది. భక్తుల సౌకర్యార్థం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న RGIA క్రాస్ రోడ్స్ వద్ద కొత్తగా బోర్డింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేసింది. ఎయిర్ పోర్ట్ నుంచి పుష్పక్ బస్సుల్లో సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నెషన్ ఎయిర్‌పోర్ట్ ( RGIA) బోర్డింగ్ పాయింట్ కి భక్తులు ప్రయాణించి.. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలానికి వెళ్లే అవకాశం కల్పిస్తూ నిర్ణయించింది. ఈ ఈ బోర్డింగ్ పాయింట్ నుంచి ప్రతి 20 నిమిషాలకో బస్సు శ్రీశైలానికి అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

దీని ద్వారా ఎయిర్ పోర్టు నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు http://tgsrtcbus.in వెబ్ సైట్ లోనూ ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని, రిజర్వేషన్ సమయంలో వారు RGIA క్రాస్ రోడ్ బోర్డింగ్ పాయింట్‌ని ఎంచుకోవాలని సూచించారు. శ్రీశైలం వెళ్లే భక్తులు కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇక, ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ పలు ప్రధాన రూట్లకు టికెట్ ధరల్లో రాయితీ ప్రకటించింది. ప్రయాణీకుల సంఖ్య పెంచుకునే లక్ష్యంతో నిర్ణయాలు అమలు చేస్తోంది.












Click it and Unblock the Notifications