హైదరాబాద్ TO అరుణాచలం, శ్రీశైలం, వేములవాడ.. తక్కువ ధరకే TGSRTC స్పెషల్ బస్సులు..

హిందువులు పవిత్రంగా భావించే కార్తీకమాసం ఈ ఏడాది అక్టోబర్ 22 నుంచి ప్రారంభం అయింది. ఈ పవిత్ర కార్తీకమాసం నవంబర్ 20 వరకు కొనసాగుతుంది. ఈ నెల రోజులపాటు శైవ క్షేత్రాలను భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలు కిటకిటలాడుతుంటాయి. అయితే కార్తీకమాసం సందర్భంగా ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు TGSRTC ప్రత్యేక బస్సు సేవలు ప్రారంభించింది. ఈ బస్సుల్లో సురక్షితంగా.. తక్కువ ధరలోనే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలను దర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి బస్సు సేవలు ప్రారంభం అవుతాయి. ప్రముఖ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న అరుణాచలం టూర్ తో పాటు శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.

కార్తీకమాసం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ భక్తులకోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్ లో భాగంగా దేశంలోని ప్రధాన శైవ క్షేత్రాలైన అరుణాచలం, శ్రీశైలం, వేములవాడ.. తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఈ మేరకు హైదరాబాద్ లోని దుండిగల్ నుంచి అరుణాచలం, వేములవాడ, శ్రీశైలం దేవస్థానాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని TGSRTC తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.

"పవిత్ర కార్తీకమాసం సందర్భంగా ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు #TGSRTC ప్రత్యేక బస్సు సేవలు! ..మీ కుటుంబంతో కలిసి సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా ప్రయాణించండి" అని ట్వీట్ లో పేర్కొంది. పూర్తి వివరాలకు TGSRTC అధికారిక వెబ్‌సైట్ www.tgsrtc.telangana.gov.in లేదా tgsrtcbus.in సందర్శించండి. లేదా హెల్ప్‌ లైన్‌ కు కాల్ చేయండి (అధికారిక సైట్‌ లో అందుబాటులో ఉంటాయి). అని పేర్కొంది.

అరుణాచలం టూర్ లో భాగంగా.. అరుణా చలం, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కంచి.. పుణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఈ టూర్ మూడు రోజులు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీకు ఛార్జీలు చూస్తే పెద్దలకు రూ. 4500, పిల్లలకు రూ. 2400గా నిర్ణయించారు. అలాగే మరో టూర్ ప్యాకేజీలో భాగంగా మైసిగండి, శ్రీశైలం డ్యామ్, శిఖరం శ్రీశైలం ప్రాంతాలను సందర్శించుకోవచ్చు. ఇది ఒక్క రోజు టూర్ మాత్రమే. ఈ టూర్ కు పెద్దలకు రూ. 1500, పిల్లలకు రూ. 900గా ఉంది.

TGSRTC special packages from Hyderabad during the month of Karthika Arunachalam Srisailam Vemulawada Ticket prices are as follows

ఇక వేములవాడ టూర్ వివరాలు ఓసారి చూస్తే.. ఈ టూర్ లో భాగంగా ధర్మపురి, కొండగట్టు అంజన్న, వేములవాడ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇది ఒక్క రోజు టూర్. ఈ టూర్ ఛార్జీలు పెద్దలకు రూ. 1200, పిల్లలకు రూ. 650 ఉంది. వీటితో పాటు విజయవాడ, మంత్రాలయం ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల కోసం 9958226150, 7671014280, 9866283555 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని TGSRTC అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+