గోల్కొండ బోనాలకు సర్వం సిద్ధం: ఈ ప్రాంతాల నుంచి స్పెషల్ సిటీ బస్సులు
TGSRTC: చారిత్రాత్మక ఆషాఢం బోనాలకు చార్ సౌ సాల్ హైదరాబాద్.. ముస్తాబైంది. గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఈ నెల రోజుల పాటు హైదరాబాద్‌లో పండగ వాతావరణం నెలకొంటుంది. బోనాల ఉత్సవాలు, పోతరాజుల విన్యాసాలతో మారుమోగిపోతుంది.
ఆషాఢమాసంలో వచ్చే తొలి ఆదివారం నాడు బోనాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. తొలి బోనం- గోల్కొండలో వెలిసిన జగదంబికా అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఆదివారమే తొలి బోనం. ఈ సందర్భంగా గోల్కొండ జగదంబిక అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. బోనాలను సమర్పించుకుంటారు.

దీని తరువాత వరుసగా హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట్ ఎల్లమ్మ బోనాలు ఉంటాయి. తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి బోనాల పండగ కావడంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. వైభవంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంది. ఇదివరకే 20 కోట్ల రూపాయలను మంజూరు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
బోనాలను సమర్పించుకోవడానికి గోల్కొండకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి గోల్కొండకు ప్రత్యేకంగా సిటీ బస్సులను నడిపించనున్నారు. 24 ప్రాంతాల నుంచి 75 సిటీ బస్సులను భక్తుల సౌకర్యం కోసం అందుబాటులోకి తీసుకుని రానున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్- 10, కాచిగూడ రైల్వే స్టేషన్- 5, మహాత్మా గాంధీ సెంట్రల్ బస్ స్టేషన్- 5, పఠాన్‌చెరు- 5, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్- 4, మెహదీపట్నం- 8, దిల్‌షుక్ నగర్- 4, హయత్ నగర్- 2, కూకట్‌పల్లి- 2, రాజేంద్రనగర్- 4, రామ్‌నగర్- 4, చార్మినార్- 6, ఉప్పల్- 4, కేపీహెచ్‌బీ కాలనీ- 4, ఓల్డ్ బోయిన్‌పల్లి- 4, మల్కాజ్‌గిరి- 4 బస్సులు గోల్కొడకు రాకపోకలు సాగిస్తాయి.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications