తెలంగాణ నా జన్మభూమి: కెటిఆర్‌తో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇన్వెస్టుమెంట్ రోడ్ షో నిర్వహించారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది.
ముంబైలో నిర్వహించిన తెలంగాణ ఇన్వెస్ట్‌మెంట్ రోడ్ షోలో భాగంగా శుక్రవారం బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇతర సేవారంగాలకు చెందిన వివిధ దిగ్గజాలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రముఖ బాలీవుడ్ హీరో, వివేక్ ఒబెరాయ్‌తో కూడా సమావేశమయ్యారు.
Minister KTR met movie star Vivek Oberoi and discussed about development of Entertainment Sector in Telangana pic.twitter.com/Q8OpLH7N2P
— Min IT, Telangana (@MinIT_Telangana) July 17, 2015 ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్న అవకాశాలపై చర్చించారు. అనంతరం మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ముంబై పర్యటనకు సంబంధించిన ఆయా ఫొటోలు, ట్వీట్లతోపాటు వివేక్ ఒబెరాయ్‌ను కలిసిన అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన వివేక్ రీట్వీట్ చేశారు.
Thanks Vivek for being generous. It was great meeting you. Let's work on fulfilling potential of Telangana & India https://t.co/yia4c96KpH
— KTR (@KTRTRS) July 17, 2015 Met @KTRTRS 3words to describe him Intelligent, Inspirational, Impressive! Great energy,commitment &Love 4his state! https://t.co/MBRj8O6UYv
— Vivek Oberoi (@vivek_oberoi) July 17, 2015 కేటీఆర్‌ను కలిశానని, మూడు మాటల్లో ఆయన గురించి చెప్పాలంటే తెలివైన, స్ఫూర్తిదాయకమైన, ఓ ప్రత్యేకత కలిగి ఉన్న వ్యక్తి అన్నారు. తన రాష్ట్ర అభివృద్ధి పట్ల మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు.
దీనికి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందిస్తూ, వివేక్ ఒబెరాయ్... మీ స్పందన బాగుందని, తెలంగాణ, భారతదేశ అభివృద్ధి కోసం కృషి చేద్దామన్నారు. ఈ ట్వీట్‌కు సైతం వివేక్ ఒబెరాయ్ రీట్వీట్ చేశారు. మీ స్పందన చాలా బాగుంది రామ్ అన్నా, తెలంగాణ నా జన్మభూమి. భారత్ నా రాష్ట్ర భూమి. మీ సేవ అంటూ రీట్వీట్ చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications