TG EAPCET: తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు..
తెలంగాణలో రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తి అయింది. రెండో విడత సీట్ల బుధవారం అలాట్ మెంట్ చేసినట్లు ఈఏపీసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 86,509 ఇంజినీరింగ్ సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో రెండు విడతాల్లో కలిపి 81,490 సీట్లను విద్యార్థులకు అలాట్ చేశారు. అంటే రాష్ట్రంలో మరో 5,019 సీట్లు మిగిలి ఉన్నాయి. అయితే 9,084 మంది రెండో విడత కౌన్సెలింగ్ లో వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నప్పటికీ వారికి సీట్లు రాలేదు.
రెండో విడత సీటు వచ్చిన వారు సంబంధింత కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేయాలన్నారు. కాగా రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి తర్వాత తెలంగాణలోని 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఉన్న 94.20 శాతం సీట్ల కేటాయించినట్లు శ్రీదేవ సేన తెలిపారు. విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలుకోవడానికి https://tgeapcet.nic.in/college_allotment.aspx వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపారు. సెల్ఫ్ రిపోర్టింగ్‌కు ఆగస్టు 2 చివరి తేదీగా పేర్కొన్నారు.

జులై 19న మొదటి విడత సీట్లు కేటాయింపు జరిగింది. అప్పుడు కన్వీనర్ కోటాకు సంబంధించి 75,200 సీట్లు కేటాయించారు. అయితే అప్పుడు సీట్ వచ్చిన కొంత మంది కాలేజీలో రిపోర్ట్ చేయకుండా రెండో విడత వెబ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. వారికి రెండో విడతలో కూడా సీటు వచ్చినట్లు తెలుస్తోంది. మొదట విడత లో
89 కాలేజీలో వంద శాతం సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో 82 ప్రైవేట్ కాలేజీలు ఉండగా.. యూనివర్సిటీ కాలేజీలు ఉన్నాయి.
మొదటి విడతలో ఇంజనీరింగ్ సీట్లు వచ్చిన వారిలో 41,308(55 శాతం) విద్యార్థులు ఉండగా, 33,892 (45 శాతం) విద్యార్థినిలు ఉన్నారు. రాష్ట్రంలో
ఈఏపీసెట్ 2024 మొదటి దఫా కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 4న ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా జులై 6 నుంచి 13 వరకు 36 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. చివరి దశ కౌన్సెలింగ్ ఆగస్టు 8 నుంచి మొదలుకానుంది.












Click it and Unblock the Notifications