హైదరాబాద్‌లో మరొకరి అరెస్టు: అతను హైదరాబాదీయే, మెకానిక్ అవతారమెత్తి...

హైదరాబాద్: హైదరాబాదులో పోలీసులు మరో అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఆ తర్వాత అతన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించే అవకాశం ఉంది.

ఇదిలావుండగా, కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార ప్రాంతంలో శనివారం తెలంగాణ పోలీసు అధికారిపై హత్యాప్రయత్నం చేసిన ఉగ్రవాదిని ఆలమ్ జబ్ అఫ్రిదీగా ఎన్ఐఎ గుర్తించింది. పలు రాష్ట్రాలకు అతను మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నట్లు, 2008 నుంచి అజ్ఞాతంలో ఉన్నట్లు నిర్ధారించారు.

ప్రస్తుతం అతను అల్ ఖలీఫా హ హింద్ ఉగ్రవాద సంస్థకు శిక్షకుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. బెంగళూరులోని ఫ్రెంచ్ కాన్సులేట్‌కు పది రోజుల క్రితం వచ్చిన బెదిరింపు లేఖ కూడా ఇతడి పనేనని చెబుతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జోహాపూర్ ప్రాంతానికి చెందిన ఆలమ్ ఇండియన్ ముజాహిదీన్ ద్వారా అతను ఉగ్రవాదం వైపు మళ్లినట్లు సమాచారం.

Alam Jab Afridi

2008లో జరిన అహ్మదాబాద్, సూరత్, జైపూర్ పేలుళ్లలో కీలక పాత్ర పోషించిన ఇతడికి ఐఎం మాస్టర్ మైండ్స్ రియాజ్, ఇక్బాల్ భత్కల్‌లతో సన్నిహిత సంబంధాలున్నాయి. అప్పటి పేలుళ్లలో బాంబులు పెట్టడానికి వినియోగించి సైకిళ్లను ఇతనే సమకూర్చినట్లు సమాచారం.

దాదాపు మూడేళ్లుగా బెంగళూరులోని హోసూరు రోడ్డు దొడ్డనాగమంగళం ప్రాంతంలో ఉంటున్న ఆలమ్ రఫీక్ అహ్మద్ పేరుతో మెకానిక్‌గా చెలామణి అవుతున్నాడు. ప్రస్తుతం సిరియాలో ఉన్న షఫీ ఆర్మర్ ప్రోద్బలంతో కొత్త రిక్రూట్ అవుతున్న జునూద్ క్యాడర్‌కు శిక్షణ ఇవ్వడానికి ఆలమ్ అంగీకరించినట్లు చెబుతున్నారు.

బాంబుల తయారీ, ఆయుధాల వినియోగంపై ఎక్కడ శిక్షణ ఇవ్వాలనే అంశంపై ఈ సంస్థ చీఫ్ ముంబైకి ముదస్సిర్‌తో పాటు హైదరాబాదీ నఫీస్ ఖాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. శుక్రవారంనాడు వారిద్దరు అరెస్టయ్యారు. దాంతో తెలంగాణ అధికారుల సాయంతో శనివారంనాడు ఎన్ఐఎ అధికారులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అతను తెలంగాణ అధికారిపై హత్యాయత్నం చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+