Medigadda: మేడిగడ్డ పిల్లర్ కుంగడంపై రాష్ట్రానికి కేంద్రం లేఖ.. !

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కేంద్రం రాష్ట్రానికి మరో లేఖ రాసింది. బ్యారేజ్ లోని 20 పిల్లర్ కొద్ది రోజులు క్రితం కుంగింది. ఇందుకు సంబంధించే కేంద్రం లేఖ రాసింది. ఘటనపై తాము కోరిన సమాచారం వెంటనే ఇవ్వాలని జాతీయ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ లేఖలో పేర్కొంది.

రేపటిలోగా వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈనెల 23 నుంచి 26 వరకు కేంద్ర కమిటీ ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత సమాచారం ఇవ్వగా.. మరికొన్ని వివరాలు ఇవ్వకపోవడంతో మరోసారి లేఖ రాసినట్లు తెలిసింది. మొత్తం 20 అంశాల సమాచారాన్ని కేంద్రం కోరింది. కాగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 3 అంశాల వివరాలు మాత్రమే ఇచ్చిందని కేంద్ర అధికారులు తెలిపారు.

The Center has written a letter to the state regarding the Medigadda project

రేపటిలోగా ఇవ్వకుంటే ప్రాజెక్టుకు సంబంధించిన ఈ డాక్యుమెంట్లు లేనట్టుగా భావిస్తామని, ఆ మేరకు తదుపరి చర్యలు చేపడతామని హెచ్చరించింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ కేసీఆర్ టార్గెట్ గా ఆరోపణలు గుపించాయి. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు వందేళ్లైన చెక్కు చెదరలేదని.. బీఆర్ఎ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు నాలుగేళ్లు కూడా ఆగడం లేదని హస్తం నేతలు ఎద్దేవా చేశారు.

అయితే పిల్లర్ కుంగడంపై అధికారులు కుట్ర కోణం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇందుకు సంబంధించి పోలీసులు ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించలేదు. ఎన్నికల వేళ మేడ్డిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్ కుంగడం బీఆర్ఎస్ ఇబ్బందేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలను బీఆర్ఎస్ తిప్పికొడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+