Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క‌రెంట్ బిల్లు రూ.21 కోట్లు, .ఖంగుతిన్న ఇంటి య‌జ‌మాని,

సాధార‌ణంగా ఓ ఇంటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? రెండు బ‌ల్బులు, ఫ్యాన్‌లకు చూసుకుంటే ఐదు వందల వరకు వస్తుంది. మరీ వినియోగం ఎక్కువైతే ఓ 5 వేల వ‌ర‌కు వ‌స్తుంది. ఏసీలు, కూల‌ర్లు, ఎల‌క్ట్రిటిక్ ప‌రిక‌రాలు ఎక్కువ‌యితే ఎంత లేద‌న్నా నెల‌కు ఒక 10 వేల వ‌ర‌కూ వ‌స్తుంది. కానీ, ఈ ఇంటికి ఎంత క‌రెంటు బిల్ వ‌చ్చిందో తెలిస్తే నిజంగానే మీకు క‌రెంట్ షాక్ త‌గులుతుంది. క‌రెంట్ బిల్లు చూసిన ఆ య‌జ‌మానికి ఒక్క‌సారిగా క‌రెంట్ షాక్ కొట్టినంత ప‌న‌య్యింది. ఆ ఇంటికి ఒక్క‌నెల క‌రెంటు బిల్లు రూ.21 కోట్లు వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాలిలా ఉన్నాయి..

బిజినేపల్లి మండలం ఖానాపురానికి చెందిన వేమారెడ్డి ఇంట్లో ఉన్న సర్వీస్‌ నెంబర్‌ 1110000 51 మీటర్‌ కేవలం 0.60 కిలోవాట్‌కు సంబంధించినది. అయితే, విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో వందల్లో రావాల్సిన క‌రెంటు బిల్లు కాస్త‌ రూ.కోట్లలో వచ్చింది. దీంతో ఆ ఇంటి య‌జ‌మాని కాస్త ఒక్క‌సారిగా ఖంగుతిన్నాడు. 01-01-1970 నుంచి 05-06-2024 వరకు 998 రోజులపాటు 297 యూనిట్లు వినియోగించినట్టు, అందుకు రూ.21,47,48,569 కరెంట్‌ బిల్లు వచ్చినట్టు ఈ నెల 5న వినియోగదారుడికి ఇచ్చి న బిల్లులో ఉంది. దాంతో బిల్లు అందుకున్న వేమారెడ్డి షాక్‌కు గుర‌య్యాడు. అయితే, ఇదేంద‌ని ట్రాన్స్‌కో సిబ్బంద‌ని ప్ర‌శ్నించగా, వారు త‌మ పై అధికారులకు ఫిర్యాదు చేశారు.

The current bill is Rs 21 crores The house owner is shocked

సాంకేతిక లోపం కారణంగా బిల్లులు ఎక్కువగా వ‌చ్చాయ‌ని ట్రాన్స్‌కో ఏఈ తెలిపారు. కేవ‌లం వేమారెడ్డికి మాత్ర‌మే కాకుండా అదే గ్రామంలో మ‌రో ప‌దిమందికి కూడా క‌రెంట్ బిల్లు రూ కోట్లలో వ‌చ్చింద‌ని తేలింది. దీంతో క‌రెంట్ బిల్లు వ్య‌వ‌హారం కాస్త చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక‌, ఈ విష‌యంపై స్పందించిన ఏఈ సాంకేతిక లోపం కారణంగా బిల్లులు ఎక్కువ వచ్చిన మాట నిజ‌మేన‌ని అన్నారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకు బిల్లులను వెంటనే సరిచేశామని ఆయ‌న వివరణ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+