Sputnik V: హైదరాబాద్ చేరిన తొలి బ్యాచ్ వ్యాక్సిన్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అక్కడికి సరఫరా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మూడోదశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇవ్వాళే ఆరంభమైంది. భారత డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ జనరల్ ఇచ్చిన అనుమతుల ప్రకారం.. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం ఈ రెండింటేనే రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి. ఇందులోనూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోన్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ వాటా అధికంగా ఉంటోంది. మూడోదశ వ్యాక్సినేషన్ కింద 18 నుంచి 44 సంవత్సరాల వరకు వయస్సున్న వారికి టీకాలను వేయాల్సి ఉంది.
స్పుత్నిక్ వీ ఫస్ట్ బ్యాచ్..హైదరాబాద్‌లో ల్యాండ్..
ఈ పరిణామాల మధ్య స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్ ఫస్ట్‌బ్యాచ్ భారత్‌కు చేరింది. తొలి బ్యాచ్ వ్యాక్సిన్‌తో రష్యా నుంచి బయలుదేరిన తొలి విమానం కొద్దిసేపటి కిందటే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. అక్కడి నుంచే ఈ వ్యాక్సిన్లను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌కు తరలిస్తారు. ఇది ఫస్ట్ షిప్‌మెంట్. ఊహించినట్టే ఈ సాయంత్రానికి భారత్‌కు చేరుకుంది. రష్యాకు చెందిన గమేలియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. స్పుత్నిక్ వినియోగానికి ఇదివరకే డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

కొరత కొంతైనా
రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇది. భారత్‌లో అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇదివరకే అనుమతి ఇచ్చింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి మూడోదశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆరంభించిన రోజే.. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనివల్ల వ్యాక్సిన్ కొరత.. కొంతవరకైనా తీరినట్టవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం టీకాల కొరత నెలకొంది. ఏపీ తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టలేకపోతున్నాయి. చాలినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వస్తోంది.

జూన్ మొదటి వారం నాటికి అయిదు లక్షల డోసులు
ఈ నెల చివరివారం లేదా జూన్ మొదటి వారం నాటికి మరో 3,00,000 డోసులు అందుతాయని చెబుతున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితుల్లో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ వినియోగానికి డీసీజీఐ కిందటి నెల 13వ తేదీన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మనదేశంలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. గామ్-కోవిడ్-వ్యాక్ కంబైన్డ్ వ్యాక్సిన్ వెక్టార్ ఇది. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో ఈ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఉంది.
Recommended Video

ధరను ఖరారు చేయని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్..
వచ్చే జూన్ మొదటి వారం నాటికి అయిదు మిలియన్ డోసుల వ్యాక్సిన్ అందే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ షిప్‌మెంట్ కింద 1,50,000 నుంచి 2,00,000 డోసులు అందొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ధర ఎంత అనేది డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇంకా నిర్ధారించలేదు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్, కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్.. వాటి రేట్లను ఇదివరకే ఖరారు చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్..నేడో రేపో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ రేటును ప్రకటించే అవకాశం ఉంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications