Hyderabad: జంట నగరాల్లో 40 కొత్త పోలీస్ స్టేషన్లు.. ఎక్కడెక్కడంటే..!
తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు మూడు ధఫాలుగా పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్సైల నియామకం చేపట్టింది. పోలీసుల నియామకమే కాకుండా శాంతిభద్రతలకు సంబంధించి అధునాత టెక్నాలిజితో నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంది. కొద్ది రోజుల క్రితం అధునాతన సౌకర్యాలతో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆఫీస్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇక్కడ నుంచి రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ కు కమ్యూనికేషన్ ఉంటుంది. అంతే కాకుండా భారీగా సీసీ కెమెరాలు ఏర్పాడు చేస్తూ నేరాలను అదుపులో ఉండేలా చేస్తున్నారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం శాంతి భద్రతలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో 40 కొత్త పోలీస్ స్టేసన్లు ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. హైదరాబాద్‌లో 12 ఏసీపీ డివిజన్లు, సైబరాబాద్‌లో 3 డీసీపీ జోన్లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వూలు ఇచ్చింది. ప్రతి జోన్‌కు ఒక మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామని సర్కార్ జీవోలో పేర్కొంది. అంతేకాకుండా కొత్తగా ఆరుగురు డీసీపీలను నియమించనున్నట్లు తెలిపింది.

40 పోలీస్ స్టేషన్లలో 11 లా అండ్ ఆర్డర్, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఏరియాలో సైబర్ క్రైం, నార్కోటింగ్ వింగ్ ఏర్పాటు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. కొత్తగా 2 టాస్క్‌ఫోర్స్ జోన్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సైబరాబాద్ లో మేడ్చల్, రాజేంద్రనగర్, రాచకొండలో మహేశ్వరం జోన్ లు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ లో దోమలగూడ, సెక్రటేరియట్, ఖైరతాబాద్, వారసిగూడ, బండ్లగూడ, ఐఎస్ సదన్, గుడిమల్కాపూర్, మాసబ్‌ట్యాంక్, ఫిలింనగర్, మధురానగర్, బోరబండ, సైబరాబాద్ లో మోకిల్లా, అల్లాపూర్, సూరారం, కొల్లూరు, జీనోమ్వ్యాలీ కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 709 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కొత్త వాటితో కలిపి ఈ సంఖ్య 749కి చేరనుంది. అలాగే తెలంగాణలో 7 పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం పోలీసు కామిషనరేట్లు ఉన్నాయి.












Click it and Unblock the Notifications