Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ శుభవార్త చెప్పింది. మార్చి 21 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే ఈదురు గాలులతో భారీ వర్షం కురిస్తే పంటలు దెబ్బుతినే అవకాశం ఉందని పేర్కొంది. ద్రోణి కారణంగా వర్షాలు పడతాయని చెప్పింది. తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఇప్పుడు మరఠ్వాడా నుండి అంతర్గత కర్ణాటక తమిళనాడును దాటి కొమోరిన్ ప్రాంతం ద్రోణి వరకు విస్తరించి ఉన్నట్లు తెలిపింది.
దీంతో మధ్య తెలంగాణలో మార్చి 20 వరకు కోస్తా ఆంధ్ర, యానాంలో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో శనివారం సాయంత్రం, రాత్రి వర్షాలు కురిసాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెల్ల, ఖాసీంపేట, బెజ్జంకి మండలంలోని వడ్లూరులో వర్షం కురిసింది. ఈదురు గాలులతో వర్షం కురవడం వల్ల మొక్కజొన్న పంట నెలకూలింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీరు లేక వర్షాల కోసం ఎన్ని రోజులు ఎదురు చూశామని చెప్పారు. కానీ ఈదురు గాలులతో వాన పడడంతో పంట దెబ్బతిన్నదని చెప్పారు. రైతులకు పంట నష్ట పరిహారం అందించాలని కోరారు. శనివారం తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంది. ఉక్కపోత కొనసాగినప్పటికీ.. కాస్త చల్లగానే ఉంది. అటు విదర్భ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్‌లు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది.
అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాంతో పాటు పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. జమ్మూ, కాశ్మీర్, లడఖ్‌లలో కూడా మార్చి 20, 21 తేదీలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications