Viral Video: కరీంనగర్ లో కుక్కల దాడి.. వైరల్ అయిన వీడియో..!
తెలంగాణలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు కరీంనగర్ లో కూడా కుక్కల దాడులు పెరుగుతోన్నాయి. తాజాగా సెప్టెంబరు 22, శనివారం సాయంత్రం కరీంనగర్ జిల్లా కాశ్మీర్ గడ్డలో ఓ మహిళపై దాడి చేయడానికి వీధి కుక్కలు ప్రయత్నించాయి. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ బాబుతో కలిసి వెళ్తోంది. ఓ ఇంటి ముందు ఆమె దాడి చేయడానికి ఒక కుక్క వచ్చింది. దీంతో ఆమె బాబును ఎత్తుకుని కుక్కను బెదిరిస్తున్న క్రమంలో మరో రెండు కుక్కులు దాడి చేయడానికి వచ్చాయి.
ఆమె పరుగెత్త క్రమంలో కింద పడిపోయి కేకలు పెట్టింది. వెంటనే చుట్టు పక్కల ఉన్నారు కుక్కలను కొట్టడంతో అవి పారిపోయాయి. ఆమె ఓ ఇంట్లోకి వెళ్లింది. నెల క్రితం కూడా కరీంనగర్ ఇలాంటి ఘటనే జరిగింది. శాతవాహన యూనివర్సిటీ రోడ్డు పక్కన ఆడుకుంటున్న ఓ బాబుపై కుక్క దాడి చేసింది. రెండేళ్ల బాలుడు హరినందన్ ముఖం పై కుక్క దాడి చేసింది. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. హరినందన్ పై కుక్క దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని కరీంనగర్ ప్రజలు కోరుతున్నారు.

సెప్టెంబర్ 9వ తేదీన నిజామాబాద్‌లోని బోదన్ నియోజకవర్గంలో 10 నెలల బాలుడిని వీధికుక్కలు కరిచి చంపాయి. చిన్నారి తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు బస్టాండ్ దగ్గర వదిలివెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 9న ములుగు జిల్లా మంగపేట్ మండలం పోదుమూరు గ్రామంలో ఓ వృద్ధురాలితో సహా తొమ్మిది మంది వ్యక్తులపై వీధికుక్కలు దాడి చేశాయి. గత సంవత్సరం హైదరాబాద్ లోని అంబర్ పేటలో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Video: Stray dog attacks woman, child in Karimnagar
— The Siasat Daily (@TheSiasatDaily) September 22, 2024
A woman and a child were attacked by stray dogs in Kashmir Gadda, Karimnagar district, on Saturday, September 22, as captured by CCTV footage circulating on social media.
The video shows a woman and child walking down the… pic.twitter.com/L0NNWddfpi
హైదరాబాద్‌లో ఏటా దాదాపు 30 వేల మంది కుక్కల కాటుకు గురవుతున్నారని నివేదికల చెబుతున్నాయి. రోజుకు 70 నుంచి 90 కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయని పేర్కొంటున్నాయి. గత దశాబ్ద కాలంలో హైదరాబాద్‌లో 3 లక్షలకు పైగా కుక్కకాటు ఘటనలు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ అధికారుల లెక్కల ప్రకారం నగరంలో 4 నుంచి 6 లక్షల కుక్కలు ఉన్నాయి. 2023లోనే 26,349 కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications