Karimnagar: అర్ధరాత్రి వంటగదిలో చప్పుడు.. వెళ్లి చూడగా షాక్..!
సాధారణంగా పాములులు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి. అడవుల్లో ఉంటాయి. ఆలాగే పల్లెల్లో ఉంటాయి. సిటీల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కొండ చిలువ సిటీల్లో చాలా తక్కువగా కనిపిస్తోంది. తాజాగా కరీంనగర్ లో కొండ చిలువ కలకలం సృష్టించింది. ఓ ఇంట్లోకి చొరబడి హల్ చల్ చేసింది. అర్ధరాత్రి వంట గదిలోకి చేరిన కొండ చిలువ రిఫ్రిజిరేటర్ పైకి చేరింది. వంట గది నుంచి శబ్దాలు రావడంతో లోపలి వెళ్లి చూసిన ఇంటి యజమాని షాక్ కు గురయ్యాడు. 12 అడుగుల కొండ చిలువను చూసి ఆశ్చర్యపోయాడు.
పాముల పట్టే వ్యక్తి సమాచారం ఇవ్వగా.. వెంటనే వచ్చిన అతను కొండ చిలువను సంచిలో బంధించి అడవిలో వదిలిపెట్టారు. కరీంనగర్ నగరంలోని మకమ్మతోటలోని ఓ ఇంట్లోకి ప్రవేశించింది. అర్ధరాత్రి వంట గదిలోకి వచ్చింది. వంట గదిలో అది తిరుగుతున్న క్రమంలో వంట సామాగ్రి కింద పడి చప్పుడు వచ్చింది. మొదటి పిల్లి అని భావించిన కుటుంబ సభ్యులు పడుకున్నారు. అయినా సౌండ్ రావడంతో వెళ్లి చూడగా కొండ చిలువ కనిపించింది.

కొండ చిలువను పట్టుకునేటప్పుడు పలువురు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియా పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ మధ్య కాలంలో కొండ చిలువలు జనసంచారంలోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం మంచిర్యాల జిల్లా నెన్నెల పోలీస్ స్టేషన్ లోకి కొండ చిలువ వచ్చింది. అది ముళ్ల కంపలో చిక్కుకుని ఎటు వెళ్లలేని స్థితిలో కనిపించింది. దీంతో పాములు పట్టే వ్యక్తి వచ్చి దాన్ని రక్షించాడు. సంచిలో బంధించి అడవిలోకి తీసుకెళ్లి వదిలి పెట్టాడు.
కరీంనగర్ మంకమ్మతోటలోని నరసన్న అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన 12 అడుగుల భారీ కొండచిలువ pic.twitter.com/GMcCh5uZD8
— Govardhan Reddy (@SportsNewsInd24) October 9, 2024
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications