TGPSC: జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన వారి జాబితా విడుదల..!
జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) విడుదల చేసింది. బుధవారం వెబ్ సైట్ లో ఎంపికైన అభ్యర్థి లిస్ట్ అందుబాటులో ఉంచింది. బాటనీ, బాటనీ ఉర్దూ మీడియం, హిందీ, తెలుగు, జువాలజీ, జువాలజీ ఉర్దూ మీడియం జేఎల్ పోస్టులకు ఎంపికైన వారివివరాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు అధికారులు ప్రకటించారు.జూనియర్ లెక్చరర్ ఫైనల్ ఫలితాలను అక్టోబర్ లో విడుదల చేశారు. 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి గత సంవత్సరం సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించారు.
అనంతరం జులై నెలలో ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితాను సబ్జెక్టుల వారీగా ప్రకటించారు. 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల్లో మల్టీజోన్ 1లో 724 పోస్టులు, మల్టీజోన్ 2లో 668 పోస్టులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పోస్టులను భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జేఎల్‌లకు పదోన్నతులను కల్పించడం ద్వారా వాటిని భర్తీ చేసే అవకాశం ఉంది.

ఇందుకోసం జేఎల్‌ల సీనియారిటీ జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు ఇంటర్ బోర్డు కార్యదర్శిని ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా గత ఆగస్ట్ లో రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా టీజీపీఎస్సీ ఛైర్మన్ గా బుర్రా వెంకటేశం బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బుర్రా వెంకటేశం 1995 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. ఆయన సర్వీస్ 2028 ఏప్రిల్ 10 వరకు ఉంది. అయినప్పటికీ ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
బుర్రా వెంకటేశం స్వస్థలం జనగామ జిల్లా ఓబుల్ కేశవపురం. నారాయణగౌడ్, గౌరమ్మ దంపతులకు జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. ప్ 1990లో తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ఎంపికయ్యారు. సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం పొందారు. 1995లో మళ్లీ సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 15వ ర్యాంక్ సాధించారు.












Click it and Unblock the Notifications