చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ఫెయిల్యూర్ వెనుక ముఖ్యమైన కారణమిదే!!
బీఆర్ఎస్ పార్టీ నుండి అవమానకర రీతిలో బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి కెసిఆర్ కు గట్టి దెబ్బ కొట్టారు. కెసిఆర్ తో పాటు చాలా కాలం క్యాబినెట్ లో పని చేసిన అనుభవం ఉన్న ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నేతలను బీజేపీ లోకి తీసుకు వస్తారని, ఇతర పార్టీల నేతలను ఆకర్షించడంలో కీలక భూమిక పోషిస్తారని బిజెపి భావించింది.
బీజేపీ అధినాయకత్వం చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ కు అవకాశం ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే బిజెపిలో ఆయనను కీలకమైన వ్యక్తి గా చూస్తూ ఆయన పైన బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. పార్టీని బలోపేతం చేయడానికి దోహదం చేస్తాడని, కీలక నాయకులను బీజేపీ లోకి తీసుకు వస్తాడు అని భావించింది. అయితే ఈటల రాజేందర్ మాత్రం బిజెపి ఆశించిన మేరకు ఏమీ చేయలేకపోయారు.

ఒకరకంగా చెప్పాలంటే చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ఫెయిలయ్యారు. అయితే ఈటల రాజేందర్ చేరికల విషయంలో ఎందుకు ఫెయిలయ్యారు? అసలు బీజేపీ లో ఏం జరుగుతుంది అన్నది ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఇతర పార్టీల్లో ఉన్న కీలక నాయకులను బిజెపిలోకి తీసుకురావడానికి ఈటల రాజేందర్ అనేకమంది నాయకులతో చర్చలు జరిపారు. అయితే ప్రతి చర్చలోనూ ఈటల రాజేందర్ వారు ఆశించిన మేరకు హామీ ఇవ్వలేకపోతున్నారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, పార్టీ మారాలని భావిస్తున్న ఆశావహులు టికెట్ హామీ ఇస్తే వారు బీజేపీ బాట పట్టే అవకాశం ఉంది. అయితే ఈటల రాజేందర్ బిజెపిలోకి వచ్చే నేతలకు టికెట్ హామీ ఇవ్వలేకపోతున్నారు. పార్టీ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ అనుమతి లేకుండా ఈటల రాజేందర్ ఎవరికి టిక్కెట్ హామీ ఇవ్వలేరు.
అంతేకాదు బిజేపిలో టికెట్ల విషయంలో అధిష్టానానిదే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. ఇక ఈ సమయంలో టికెట్లు హామీ ఇవ్వడం ఖచ్చితంగా సాధ్యం కాదు. టికెట్ హామీ లేకుండా కీలక నేతలెవరూ పార్టీ మారే సాహసం చెయ్యరు. ఈ పరిస్థితులు ఈటల రాజేందర్ ఫెయిల్ కావడానికి ప్రధాన కారణమని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications