Weather Update: రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు..!

తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వివరించింది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా, అండమాన్- నికోబార్ దీవుల సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఇది అల్పీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. 21వ తేదీ నాటికి ఇది అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. నైరుతి తీరానికి ఆనుకుని పశ్చిమ బంగాళాఖాతానికి ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని
వివరించింది.

ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది. ఇది పైకి వెళ్లొన్న కొద్ది నైరుతి దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది.అండమాన్ సముద్ర ప్రాంతంలో సగటున సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ ఆవర్తనం ఉత్తర దిశగా కదులుతూ అల్పపీడనంగా మారుతుందని.. అక్టోబర్​ 23వ తేదీనాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో 21, 22 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

IMD warns the people of Telangana Rains for two more days

23,24 తేదీల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సోమ, మంగళవారం కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొంత మంది రైతులు ఇప్పటికే వరి కోతలు కోశారు. ధాన్యం కల్లాల్లో ఉంది. మరి కొంత మంది రైతులు కోతకు సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో వర్షాలు కురిస్తే నష్ట వాటిల్లుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో వరి పైరు నెల కూలుతోందని చెబుతున్నారు. కాగా అటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాకినాడ, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+