Weather Update: నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు..!

శని, అదివారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు పలు చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు ఛాన్స్ ఉందని పేర్కొంది. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. శనివారం పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఆదివారం కూడా వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రంగారెడ్డి, హైద‌రాబాద్, మేడ్చ‌ల్, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, జ‌గిత్యాల‌, సిరిసిల్ల‌, మెద‌క్, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నారాయ‌ణ‌పేట జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన తేలికపాటి నుంచి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాం ఉందని అంచనా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలిపాటి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, మోతినగర్, బోరబండ, యూసఫ్ గూడ ప్రాంతాల్లో వాన పడింది.

The Meteorological Department has said that heavy rains are likely to occur in many parts of Telangana on Saturday and Sunday

దీంతో పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. గత కొద్ది రోజులు ఉక్కపోత బాధపడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పాటు ఉక్కపోత కూడా తగ్గింది. దక్షిణాది రాష్ట్రాలపై నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు ఐఎండి ప్రకటించింది. శనివారం కేరళ, కర్ణాటక, గోవాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

అటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు మండి పోతున్నాయి. శుక్రారం సాయంత్రం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాతావరణం కాస్త చల్లపడింది. రుతుపవనాలు ఉత్తరాదికి విస్తరించాలంటే సమయం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+