• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నగరానికి వ్యాపించిన కొత్త సంస్కృతి..! టాటూలతో మురిసిపోతున్న యువత..!!

|
  టాటూలతో మురిసిపోతున్న యువత..! || Tattoo Culture Hits Hyderabad City || Oneindia Telugu

  హైదరాబాద్ : పచ్చబొట్టు చెరిగీ పోదూలే.. నా రాజా.. అని ఓ మహానుభావుడు అన్నట్టు అది ఇప్పుడు యువతలో ట్రెండీగా మారింది. ఇంత కాలం ఎక్కడో విదేశాల్లో ఉండే పచ్చ బొట్టు అదే టాట్టూ సంస్క్రుతి ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని తాకింది. ఐతే ఈ పచ్చ బొట్టు అనే మాట ఇప్పటిమాటకాదు. చాలా ఏళ్ళ నుంచి వింటున్న మాటే. నచ్చినపేరో, మెచ్చిన డిజైనో చేతులపై.. పచ్చబొట్టుగా ముద్రించుకోవడం తరతరాలుగా చూస్తున్నది.. వింటున్నదే.

  జీవితాంతం చెరగని గుర్తుగా శరీరంపై శాశ్వంతంగా ఉండిపోయే పచ్చబొట్టు.. ఇప్పుడు కొత్తగా 'టాటూ'గా రూపాంతరం చెంది ఫ్యాషన్‌ ప్రపంచంలో సరికొత్తట్రెండ్‌కు బాటలు వేస్తోంది. రాచరికపు కాలంలో వారి, రాజరికానికి గుర్తుగా నిలిచి, తర్వాత ప్రేమైక బంధాల చిహ్నంగా సమాజంలో పలురకాలుగా విస్తరించిన నాటి పచ్చబొట్టు, ఆధునిక హంగులు దిద్దుకోవడంతోపాటు.. ఈపచ్చబొట్టు కళ(టాటూ ఆర్ట్‌) చాలామంది యువతకు జీవనోపాధిగానూ మారుతోంది.ఇదే టాట్టూ సంస్కృతి ఇప్పుడు నగరాన్ని పలకరిస్తోంది. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల టాట్టూ కళాకారులు రకరాకల డిజైన్లతో నగర యువతను ఆకర్శిస్తున్నారు.

  The new culture that spread to the city.!The young people are thrilled with tattoos..!!

  ఇష్టమైన వారి పేర్లు, మనసుకు నచ్చిన డిజైన్ శరీరం మీదనో, చేతి మీదనో వేయించుకుని సంబరపడిపోతున్నారు నగర యువత. అంతే కాకదుండా పెళ్ళి, పుట్టినరోజు, కిట్టీపార్టీ, గెట్‌ టుగెదర్‌ పార్టీ.. ఇలా నలుగురు కలిసే ఏ సరదా కార్యక్రమం అయినా అక్కడ టాటూ కళ చొరబడి రంగురంగుల సరదాలు పంచిపెడుతుంది. ఒకప్పటి పచ్చబొట్టు ఎప్పటికీ చెరగని చిహ్నాలుగా మిగిలిపోతే, ఇప్పటి పచ్చబొట్లుమాత్రం సీతాకోకచిలుకల రూపంలో అలరిస్తున్నాయి.

  ఫ్యాషన్‌ ట్రెండ్‌కు అనుగుణంగా రకరకాలు రూపాల్లో విస్తరిస్తున్న టాటూ కల్చర్ ట్రెండీగా మారింది. ఇక ఈ టాట్టూలు ధర కూడా అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. డిజైన్ ఐతే ఒక రేటు, పేరు ముద్రించాలంటే ఒక్క లెటర్ కు ఇంత రేటని కళాకారులు నిర్థారించుకున్నారు. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల వ్యాపించిన టాట్టూ కల్చర్ పై యువత పెద్ద ఎత్తున ఆకర్శితులవుతున్నట్టు తెలుస్తోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The same tattoo culture, who has been abroad for so long, has now hit the city of Hyderabad. On the other hand, the design of the designer The tattoo is seen for generations. Listening. The tattoo that remains permanent on the body to mark the life of life. Now it is being transformed into a new ' tattoo ' and the new trend in the fashion world is paved.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more