Drugs: క్యాప్సూల్స్ రూపంలో డ్రగ్స్.. పట్టుకున్నపోలీసులు..

తెలంగాణలో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు ఉక్కపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ మత్తు పదార్థాలను సీజ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతున్నకొద్ది హైదరాబాద్ లో డ్రగ్స్, గంజాయి వంటి మత్త పదార్థాల రవాణా పెరుగుతోంది. ఇటు జిల్లాల్లో కూడా గంజాయి వాడుతున్న వారు పెరుగుతున్నారు. దీంతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు.

ఓ బయోమెడదిక్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసులో ఈ డ్రగ్స్ నిలువ ఉంచారని సమాచారం అందడంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. రూ.6 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే మత్తు పదార్థాలను క్యాప్సూల్స్ రూపంలో నిల్వ ఉంచారు. ఫార్మా కంపెనీపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ను 'డ్రగ్స్ రహిత సిటీ'గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

The police caught the accused who were supplying drugs in Nizamabad

రెండు రోజుల క్రితం ఫిలింనగర్‌లోని పబ్ పార్కింగ్ ఏరియాలో ఒక వ్యక్తి డ్రగ్స్ అమ్ముతున్నాడనే సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దాడులు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. బెంగళూరుకి చెందిన ఆ వ్యక్తి పేరు బాబు కిరణ్‌గా గుర్తించారు. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న అతడ్ని పబ్ పార్కింగ్ వద్ద రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. శనివారం డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఒక యువతితో పాటు మరో యువకుడిని షాద్‌నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి 11గ్రాముల ఎండీఎంఏ, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యాదగిరిగుట్ట ఆలేరు ప్రాంతానికి చెందిన కొండెం ప్రియాంక రెడ్డి అలియాస్‌ ప్రియా(29) ఆర్క్‌టెక్చర్‌ గా పని చేస్తున్నారు. వృత్తిపరంగా నగరానికి వలసొచ్చి, మాదాపూర్‌, సిలికాన్‌ వ్యాలీ ప్రాంతంలోని న్యూ పాష్‌ప్లేస్‌ గర్ల్స్‌ హాస్టల్‌లో ఉంటుంది. ఏపీలోని విజయనగరం ప్రాంతానికి చెందిన శ్రీతేజ(29) టెక్‌ మహేంద్రలో పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి డ్రగ్స్ అలవాటు పడ్డారు. ఆ తర్వాత డ్రగ్స్ అమ్మడం ప్రారంభించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+