Preethi: ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్ పై సస్పెన్షన్ తాత్కాలికంగా నిలివేత..

గత ఫిబ్రవరిలో వరంగల్‍ కాకతీయ మెడికల్‍ కాలేజీ స్టూడెంట్‍ ధరావత్‍ ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సైఫ్ పై ఏడాది పాటు సస్పెన్షన్ విధించారు. అయితే సైఫ్ పై తాక్కాలికంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశించింది. సైఫ్ ను మెడికల్ కాలేజీలో జాయిన చేసుకోవాలి స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఓ ప్రకటన చెప్పారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 22న పీజీ చేస్తున్న ప్రీతి తాను డ్యూటీ చేస్తున్న ఎంజీఎం ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో పడి ఉంది.

గమనించిన సిబ్బంది ఆమెను ఐసీయూకి తరలించి చికిత్స చేశారు. మెరుగైన చికిత్స హైదరాబాద్ లోని నిమ్స్ తీసుకొచ్చారు. ప్రీతి చికిత్స పొందుతూ ఫిబ్రవరి 26న కన్నుమూసింది. ప్రీతి అప్పట్లో సంచలనంగా మారింది. ప్రీతి మృతికి సీనియర్ సైఫ్ కారణమని తెలింది. దీంతో గిరిజన, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారి. ఈ అశంపై హైకోర్టు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సహచర విద్యార్థులు, అధికారులు, ఆస్పత్రి సిబ్బంది, వాట్సాప్ మెసేజ్ లు, సైఫ్ ర్యాగింగ్ వల్లే ప్రీతి ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు.

The suspension of the accused Saif in the Preeti suicide case has been temporarily lifted

సైఫ్ పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సైఫ్ ను సస్పెండ్ చేయాలంటూ నేషనల్ మెడికల్ కమిషన్, యూజీసీలకు సిఫారసు చేసింది. దీంతో సైఫ్ పై సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై సైఫ్ హైకోర్టును ఆశ్రయించాడు. యాంటీ ర్యాంగింగ్ కమిటీ సైఫ్ ను విచారించకుండానే ఏడాది పాటు సస్పెన్షన్ విధించాలని సిపార్సు చేసినట్లు హైకోర్టు దృష్టికి సైఫ్ తరఫు న్యాయవాది తీసుకెళ్లాడు. సైఫ్ వివరణ తీసుకోకుండా సస్పెన్షన్ విధిండం సరైందని కాదని హైకోర్టు అభిప్రాయపడింది. సైఫ్ పై చర్యలను తాత్కాలికంగా రద్దు చేసింది.

సైఫ్ క్లాసులు వినేందుకు అవకాశం కల్పించాలని కాలేజీ ప్రిన్సిపల్ ను అదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సైఫ్ క్లాసులకు అనుమతిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు. వారం తర్వాత యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. అయితే ప్రీతి కేసులో కాలేజీ తీరు మొదటి నుంచి అనుమాస్పదంగానే ఉంది. ప్రీతి డిపార్ట్ మెంట్ హెచ్ఓడీపై కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. గిరిజన బిడ్డ ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి అధికారులు తీరే కారణంగా గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+