Traffic Challan: వారికి ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఉండదట..!
తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు చెల్లించడానికి రాయితీని ప్రకటించింది. దీనిపై వారం క్రితమే వార్తలు వచ్చాయి. డిసెంబర్ 26 నుంచి ట్రాఫిక్ చలాన్లపై రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నాయి. చాలా మంది డిసెంబర్ 26 వెబ్ సైట్ ఓపెన్ చేసి పెండింగ్ చలాన్లు పే చేయాలని చూశారు. కానీ వారికి డిస్కౌంట్ చూపించలేదు. దీంతో వారు ఎక్స్ లో పోలీసు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన పోలీసులు రాయితీలపై జీవో రాలేదని చెప్పారు. అయితే అదే రోజు మధ్యాహ్నం చలాన్లపై రాయితీ ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
దీంతో చాలా మంది పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు చెల్లిస్తున్నారు. కొందరికి మాత్రం రాయితీ ఉండదని ట్రాఫిక్ పోలీసులు చెదుతున్నారు. డిసెంబర్ 25 తర్వాత చలాన్లు పడిన వారికి రాయితీ వర్తించదని స్పష్టం చేశారు. డిసెంబర్ 25 లోపు వాహనాలపై పడిన చలాన్లకు మాత్రమే రాయితీ వర్తిస్తుందని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. జీవో ప్రకారం డిసెంబర్ 26 నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తిస్తుందని.. ఈ రాయితీ డిసెంబర్ 25 లోపు ఉన్న చలాన్లకే వర్తిస్తుంది.

గత ప్రభుత్వం కూడా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ప్రకటించింది. ఆ సందర్భంంగా ప్రభుత్వ ఖాజానాకు రూ. 300 కోట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా భారీగా పెండింగ్ చలాన్లు ఉండడంతో ప్రభుత్వం చలాన్లపై రాయితీ ప్రకటించింది. అయితే గతం కంటే ఇప్పుడు ఎక్కువగా రాయితీ ప్రకటించింది. టూవీలర్స్,త్రీ వీలర్స్ పై 80 శాతం, టీఎస్ ఆర్టీసీ బస్సులపై 90 శాతం, 60 శాతం లైట్ వెయిట్ లేదా హెవీ వెయిట్ మోటార్ వెహికల్స్, కార్లపై 60 శాతం రాయితీ ప్రకటించారు.
మీకు త్రీ వీలర్, టూ వీలర్ ఉంటే.. మీకు రూ.1000 ఫైన్ పడితే అందులో మీరు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. మీకు లారీలు, కార్లు ఉంటే.. ఇదే రూ.1000 ఫైన్ కు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది. ఆర్టీస్ బస్సులకు అయితే రూ.1000 ఉంటే రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.












Click it and Unblock the Notifications