Liquor Shop Tender: మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు.. రూ.2 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం..!
తెలంగాణలో మద్యం షాపు టెండర్లకు భారీగా స్పందన వస్తుంది. ఇప్పిటికే వేల సంఖ్యల్లో దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి దరఖాస్తు రుసుముతోనే దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వైన్ షాపులకు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తంలో 2620 మద్యం షాపులకు ఎక్సైజ్ శాఖ టెండర్లు ఆహ్వానించింది. టెండర్లకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు నేటితో ముగియనుంది. మద్యం టెండర్లకు అప్లికేషన్ పెట్టాలంటే రూ.2 లక్షలు కట్టాలి. అయితే ఇది రిఫండబుల్ కాదు.
కాగా ఈ మద్యం షాపుల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. గౌడ్స్ కు 15 శాతం రిజర్వేషన్ కేటాయించగా.. ఎస్సీలకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. ఈ లెక్కన గౌడ్స్ కు 363 మద్యం షాపులు రాగా.. ఎస్సీలకు 262 షాపులు కేటాయించారు. నిజామాబాద్ జిల్లాల్లో మొత్తం 102 మద్యం షాపులు ఉండగా.. బుధవారం వరకు 746 అప్లికేషన్లు వచ్చాయి. గురువారం దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. అటు కామారెడ్డి జిల్లాలో 49 మద్యం షాపులు ఉండగా.. నిన్నటి వరకు భారీగా దరఖాస్తులు వచ్చాయి.

నిర్మల్ జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు బుధవారం నాటికి 108 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గురువారం దరఖాస్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో 9 దుకాణాలు రిజర్వు కాగా, ఇందులో ఒకటి ఎస్టీ, ఐదు దుకాణాలు ఎస్సీ, మూడు గౌడ్‌లకు కేటాయించారు. గతంలో ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున రూ.1,357 కోట్లు రాగా.. ఈసారి రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. దరఖాస్తులు తక్కువగా వస్తున్న జిల్లాలకు అధికారులను పంపాలని ఆదేశించారు. వ్యాపారులు సిండికేట్ కాకుండా చూడాలన్నారు. తక్కువ ఆర్జిలు వస్తున్న నిర్మల్, ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు హైదరాబాద్ నుంచి అధికారులను పంపారు. దుకాణాలకు ఎందుకు అప్లికేషన్లు తక్కువ వస్తున్నాయి. గతంలో ఏమైన అప్లికేషన్లు వచ్చాయా.. అధికారులు ఆరా తీస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు దాదాపు 42వేల అర్జీలు వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం, శుక్రవారం రెండు రోజుల్లో మరో 60 వేల దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications