RTC: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు హాఫ్ టికెట్..!
తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ ల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. దీంతో మహిళలు బస్సుల్లో భారీగా ప్రయాణం చేస్తున్నారు. ఉచిత బస్ పథకాన్ని ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టింది. అయితే చాలా మంది మహిళలు అవసరం ఉన్నా లేకున్నా.. బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ల బస్సుల్లో ఎక్కి ఎక్కడపడితే అక్కడ ఆపుతున్నారు.
దీంతో పనులపై ఊరు వెళ్లే వారికి ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరగడం లేదు. జగిత్యాలకు చెందిన ఓ మహిళ హైదరాబాద్ లో ఉంటున్న తన కుమార్తెకు గేదె పాలు ఇవ్వడానికి వారానికి ఒకసారి జగిత్యాల నుంచి హైదరాబాద్ వెళ్తున్నారట. సాధారణంగా ఈ రూటులో బస్సు టికెట్ రూ.300 పై చిలుకు ఉంటుంది. ఆమె రూ.100 పాలు ఇవ్వడానికి రూ.300 టికెట్ పై ఉచిత ప్రయాణం చేస్తుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. మరో ఘటనలో ఓ మహిళ చీపురు కోసం బస్సు ఎక్కి మరో ఊరు వెళ్లి చీపురు కొనుగోలు చేసినట్లు చెప్పుకుంటున్నారు.

ఇలా చిన్న చిన్న పనులకు కూడా ఆర్టీసీ బస్సులు ఎక్కడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ఎక్స్ ప్రెస్ లో ఎక్కడానికి గుండ్లపల్లి స్టేజీ వద్ద ఓ వ్యక్తి బస్ ఆపాడు. అప్పుడు కండక్టర్ సీట్ లేదు.. సికింద్రబాద్ వరకు నిల్చోవాలనుకుంటే రావొచ్చని అన్నాడు. చేసేది ఏమి లేక ఆ వ్యక్తి జేబీఎస్ వరకు నిల్చోని బస్సులో ప్రయాణం చేశాడు. ఇలా చాలా మంది బస్సుల్లో సీట్ల దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వ మహిళ ఉద్యోగులు కూడా వాడుకుంటున్నారు. ఓ మహిళ ఉద్యోగి రోజూ విధులకు కారులో వచ్చేది. కానీ ఉచిత బస్సు ఉంది కాదా అని ఆమె బస్సులోనే వస్తున్నారు. ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లు కూడా ఉపాధి కోల్పోతున్నారు. ఈ ఉచిత పథకం వల్ల ప్రభుత్వం నష్టపోవడమే కాకుండా సాధారణ ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకే మహారాష్ట్రలో ఉన్నట్లుగా మహిళలకు హాఫ్ టికెట్ ఉండాలని పలువురు కోరుతున్నారు.
దీంతో మహిళలు అనవసరంగా బస్సుల్లో ప్రయాణం చేయలేరని చెబుతున్నారు. అయితే దీనిపై ఆర్టీసీ కానీ.. ప్రభుత్వం కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లోక్ సభ ఎన్నికల తర్వాతా దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications