Hyderabad: మందు బాబులకు షాక్.. సిటీలో లైట్ బీర్ల కొరత..!
రాష్ట్రంలో ఎండలు మండి పోతున్నాయి. వడగాలులు వీస్తున్నాయి. వేడి తట్టుకోలేక చాలా మందీ శీతాలపానీయలు, మజ్జిక, చెరుకు రసం, జ్యూస్ లు తాగుతున్నారు. ఇక మందు బాబులు అయితే బీర్లు కొడుతున్నారు. ఎక్కువగా హార్డ్ తాగేవారు కూడా ఎండ వేడికి బీర్లు తాగుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో లైట్ బీర్లు భారీగా డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరగడంతో బీర్ల కొరత ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలా వైన్ షాపుల్లో బీర్ల కొరత కనిపిస్తోంది.
గత ఐదారు రోజుల నుంచి బీర్ల షార్టేజ్ ఉన్నట్లు చెబుతున్నారు. లైట్ బీర్లు, ఆర్సీ లైట్, ట్యూబర్గ్, కేఎఫ్ లైట్ బీర్ల కొరత ఎక్కువగా ఉంది. రెండు, మూడు షాపులు తిరిగినా బీర్ల దొరకని పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల లైట్ బీర్లు లేక మందు బాబులు స్ట్రాంగ్ బీర్లు తాగేస్తున్నారు. ఇష్టం లేకున్నా లైట్ బీర్లు దొరక్క.. ఎండ వేడి తట్టుకోలేక స్ట్రాంగ్ బీర్లు కొడుతున్నారు. ఎండకాలంలో బీర్ల కొరత ఏర్పడం సాధారణం. అయితే సమ్మర్ బీర్లకు ఎక్కువ గిరాకీ ఉంటుందని తెలిసినా స్టాక్ తెప్పించుకోలేదని మందు ప్రియులు చెబుతున్నారు.

పలు చోట్ల వైన్స్ సిబ్బందితో మందు బాబులు గొడవకు దిగుతున్నారు. చల్లగా బీరు తాగుదమంటే లేవని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లైట్ బీర్ల కొరత ఉన్నట్లు చెబుతున్నారు. ఎండ కాలం బీర్ల అమ్మకాలు భారీగా పెరుగుతాయి. గత ఏడాది కూడా రికార్డు స్థాయిలో బీర్ల విక్రయాలు జరిగాయి. 2023 మేలో 4 కోట్ల 23 లక్షల బీర్ల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
అంటే రోజుకు 23 వేలకు పైగా బీర్లను విక్రయించారు. ఈసారి కూడా గతేడాది రికార్డు బ్రేక్ అవుతుందో చూడాలి. ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో బీర్ల సేల్స్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అటు పక్క రాష్ట్రం కర్ణాటలో కూడా బీర్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది. అక్కడ రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరిగాయి.












Click it and Unblock the Notifications