థర్డ్ ఫ్రంట్‌పై తండ్రి తర్వాత తనయుడు: కేసీఆర్‌తో అసాధ్యమని బిజెపి
హైదరాబాదు: తాను థర్డ్ ఫ్రంట్ పెడుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటనపై ఆయన తనయుడు, మంత్రి కేటీ రామారావు స్పందించారు. మన దేశం రెండు పార్టీలకే చెందింది కాదని అన్నారు. థర్డ్ ఫ్రంట్‌పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన గురువారం స్పందించారు.
మన దేశంలో అనేక పార్టీలు ఉన్నాయని, మనది రెండు పార్టీల ప్రజాస్వామ్యం కాదని, ప్రాంతీయ పార్టీలు కూడా మనదేశంలో బలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు థర్డ్ ఫ్రంట్‌కు మంచి అవకాశాలున్నాయని చెప్పారు.
లేదంటే థర్డ్ ఫ్రంట్ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు ఎన్నికలు రావడానికి మరో ఏడాది గడువు ఉందని, మున్ముందు సమీకరణాలు ఎలా మారుతాయో వేచి చూడాలని అన్నారు. సిఎం కేసిఆర్ చెప్పినట్లుగా దేశ ప్రజలు కాంగ్రెసు, బిజెపిలకు అనేక అవకాశాలు ఇచ్చారని, కానీ ఆ పార్టీలు ప్రజల ఆకాంక్షలను తీర్చలేకపోయాయని అన్నారు.

ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టి థర్డ్ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తానని కేసీఆర్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు బిజెపి జాతీయ నేత శేషగిరి రావు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకుని అధికారంలోకి రావచ్చునని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలకు మిగులు జలాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అటువంటి స్థితిలో ఏ విధంగా ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తారని అన్నారు.
భారతదేశంలో ఉన్న నదుల స్వరూపాన్ని కెసిఆర్ తెలుసుకోవాలని శేషగిరి రావు అన్నారు. నదుల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదని అన్నారు. రాష్ట్రాల మధ్య ఉన్న అంతరాలను తొలగించడం కేసీఆర్ వల్ల కాదని అన్నారు..
రిజర్వేషన్ల కల్పనను రాష్ట్రాలకు వదిలేయాలని కేసీఆర్ అనడాన్ని ఆయన ఖండించారు. రిజర్వేషన్ల పెంపు అనేది చాలా సున్నితమైన విషయమని ఆయన అన్నారు. ఇది ఆషామాషీ వ్యవహారం కానది అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల్లో వైషమ్యాలు, విద్వేషాలు చెలరేదే ప్రమాదం ఉందని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో మత ప్రాతిపదికపై రిజర్వేన్లు పెంచాలని అనడం సరి కాదని అన్నారు. అలాంటి ప్రయత్నాలు చేయవద్దని ఆయన కేసీఆర్‌ను కోరారు.












Click it and Unblock the Notifications