వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు బాహుబలి?: కాంపౌండ్ దాటితే రేవంత్‌కు గండమే!, ఇదీ పరిస్థితి..

ముఖ్యమంత్రి అభ్యర్థి పట్ల ఇప్పటికే పార్టీలో తగువులాట నడుస్తోంది. ఇప్పుడు రేవంత్‌ను తీసుకొస్తే అది మరింత ముదురుతుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏసీబీ కోర్టు.. హైకోర్టు.. సుప్రీం కోర్టు.. వీటి చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఓటుకు నోటు కేసు దాదాపుగా తెరమరుగైపోయిన పరిస్థితి. కేసీఆర్-చంద్రబాబుల మధ్య కుదిరిన రహస్య ఒప్పందమో.. మరేమో కానీ ఆ కేసు సృష్టించిన సంచలనం క్రమంగా చల్లబడిపోయింది.

ఏపీ సీఎం చంద్రబాబు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లొంగిపోయారా? అన్నట్టుగా హైదరాబాద్ నుంచి పూర్తిగా మకాం మార్చేశారు. ఇటువైపు రాజకీయాలను కూడా ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. దేశ రాజకీయాల్లో తానే సీనియర్ అని చెప్పుకునే బాబు.. ఇన్నాళ్ల రాజకీయ జీవితాన్ని ఓటుకు నోటు కేసుకు పణంగా పెట్టదలుచుకోలేదు. కాబట్టి కేసును ఎదుర్కోవడం కంటే రహస్య ఒప్పందానికే ఆయన మొగ్గు చూపి ఉంటారన్న వాదన ఉంది.

 కేసు గండంతోనే ఇన్నాళ్లు కాంపౌండ్ దాటలేదు:

కేసు గండంతోనే ఇన్నాళ్లు కాంపౌండ్ దాటలేదు:

చంద్రబాబు తెలంగాణలో పార్టీ పరిస్థితిని పట్టించుకునే అవకాశం లేకపోవడంతో.. ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ పార్టీ నడుస్తూ వస్తోంది. ఓటుకు నోటుతో తన ఇమేజ్ పెరిగిందో తగ్గిందో తేల్చుకోలేని స్థితిలో రేవంత్.. పార్టీలో ఉంటూనే స్వతంత్ర పోకడలు కొనసాగించారు. చావుదెబ్బ తిన్న పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం ఎంత అసాధ్యమో ఆయనకు కూడా తెలుసు. కానీ పార్టీ నుంచి బయటకు వద్దామంటే ఓటుకు నోటు కేసు గండం ఒకటి వెంటాడుతుండటంతో.. టీడీపీ కాంపౌండ్ దాటడానికి ధైర్యం చేయలేక సతమతమవుతున్నారు.

Recommended Video

కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు షాక్ ! | Oneindia Telugu
 స్వతంత్రంగా ఉంటూ.. ఉక్కిరిబిక్కిరి

స్వతంత్రంగా ఉంటూ.. ఉక్కిరిబిక్కిరి

అందుకే పైకి మాత్రం టీడీపీ సైనికుడిగా కనిపిస్తూ.. లోపల తన అంతర్గత రాజకీయాలను నెరిపాడు. రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తం కూడగట్టి కొత్త పార్టీ పెట్టాలన్న ప్రయత్నాలు కూడా చేశారని ఆమధ్య జోరుగానే ప్రచారం జరిగింది. పార్టీతో సంబంధం లేకుండానే మల్లన్నసాగర్ లో ధర్నా కూడా చేశాడు. ఇదంతా సీనియర్లకు మింగుడుపడకపోయినా.. చంద్రబాబు మాత్రం రేవంత్ మీద నమ్మకం ఉంచుతూ వస్తున్నారు.

ఇక కేసు విషయానికొస్తే.. తనతో పాటు చంద్రబాబు కూడా ఉన్నారు కాబట్టే రేవంత్ బతికిపోయారన్న వాదన ఉంది. దీంతో అటు పార్టీని వీడలేక.. ఇటు రాజకీయంగా ఎదుగూ బొదుగూ లేక ఉక్కిరిబిక్కిరవుతున్నాడు రేవంత్. ధైర్యం చేసి పార్టీని వీడినా.. ఎక్కడ ఓటుకు నోటు కేసు మళ్లీ తనను ఉచ్చులోకి లాగుతుందేమోనన్న భయం ఆయనను వెంటాడి ఉండవచ్చు.

 రేవంత్ ధైర్యం చేశారు.. కానీ టీఆర్ఎస్?

రేవంత్ ధైర్యం చేశారు.. కానీ టీఆర్ఎస్?

అయితే ఇన్నాళ్లకు రేవంత్ రెడ్డి ధైర్యం చేసినట్లే కనిపిస్తున్నారు. ఎదుగూ బొదుగు లేని రాజకీయం కంటే ఏదో ఒకటి తేల్చుకోవడమే బెటర్ అనే ఆలోచనతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ అధికార పక్షం అంత తేలిగ్గా వదిలిపెడుతుందా?.. సందర్భం వచ్చిన ప్రతీసారి కేసీఆర్‌పై అంతెత్తున లేచే రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఇన్నాళ్లు ఓపికతో వ్యవహరిస్తూ వస్తోంది. కానీ ఇకముందు టీఆర్ఎస్ వైఖరి మారే అవకాశాలు లేకపోలేదు.

చంద్రబాబు పంచెన ఉన్నారు కాబట్టి.. ఇన్నాళ్లు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పెద్దగా శ్రద్ద పెట్టలేదు. కానీ ఇప్పుడా గూటిని వీడుతున్నారు కాబట్టి.. కేసు దర్యాప్తును టీఆర్ఎస్ మరోసారి వేగవంతం చేసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే.. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం సందిగ్ధంలో పడే అవకాశాలను కొట్టిపారేయలేం.

కాంగ్రెస్‌కు బాహుబలి దొరికాడా?

కాంగ్రెస్‌కు బాహుబలి దొరికాడా?

బాహుబలి వస్తాడు.. తమను గెలిపిస్తాడు.. అని వేయి కళ్లతో చూస్తున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని చేర్చుకుని ఏ మేర బలపడుతుందనేది అనుమానమే. అది అపోహనా?.. లేక కాంగ్రెస్ అంచనా నిజమవుతుందా? అన్నది తేలడానికి ఎన్నికల దాకా కూడా ఆగాల్సిన పనిలేక పోవచ్చు.

అంతకన్నా ముందే పార్టీలో సీనియర్లు రేవంత్ చేరికను సహించే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి పట్ల ఇప్పటికే పార్టీలో తగువులాట నడుస్తోంది. ఇప్పుడు రేవంత్‌ను తీసుకొస్తే అది మరింత ముదురుతుంది. ఆ ముదరడం కొంతమంది పార్టీని వీడేదాకా వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మొత్తం మీద స్తబ్దుగా ఉన్న తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పార్టీ మార్పు అంశం కొన్నాళ్లు మీడియాకు, జనానికి కేవలం ఉబుసు పోని లోటును తీరుస్తుందా!.. లేక.. తెలంగాణ రాజకీయాలను గట్టిగానే ప్రభావితం చేస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.

English summary
Telangana state Telugu Desam working president A. Revanth Reddy, who is Delhi, on Tuesday reportedly spoke with senior AICC leaders and told them of his interest in joining the Congress to take on the TRS in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X