హైదరాబాద్ వాసులకు అలర్ట్: రెండ్రోజులు తాగునీటి సరఫరా బంద్, ఈ ప్రాంతాల్లోనే

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు తాగునీటి సరఫరా అంతరాయం ఏర్పడనుందని జలమండలి(HMWSSB) అధికారులు తెలిపారు. ఆగస్టు 19న ఉదయం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం వరకు దాదాపు 30 ప్రాంతాల్లో పాక్షికంగా లేదా పూర్తిస్థాయిలో నీటి సరఫరా నిలిచిపోనుంది.

హైదరాబాద్ నగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై ఫేజ్-2లో కలబ్‌గూర్ నుంచి పటాన్‌చెరు వరకు పైప్‌లైన్‌కు జంక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆర్అండ్‌బీ శాఖ బీహెచ్ఈఎల్ క్రాస్ రోడ్ వద్ద నూతనంగా నిర్మిస్తోన్న ఫ్లైఓవర్ పనులకు ఆటంకం కలగకుండా ఈ జంక్షన్ పనులు చేపట్టనున్నారు.

These places in hyderabad to face drinking water supply disruption from august 19 to 20th

ఈ క్రమంలో ఎర్రగడ్డ, అమీర్‌పేట, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరి గుట్ట, ఎల్లారెడ్డిగూడ, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, దీప్తి శ్రీ నగర్, మదీనా గూడ, మియాపూర్ ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రభావం కనిపిస్తుంది.

తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

ఓ అండ్ ఎం డివిజన్ నెంబర్ 6: ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్ (తదితర ప్రాంతాల్లో పాక్షిక అంతరాయం కలుగుతుంది)

ఓ అండ్ ఎం డివిజన్ నెంబర్ 8: ఈ డివిజన్ పరిధిలోని ఆఫ్ టేక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు.

These places in hyderabad to face drinking water supply disruption from august 19 to 20th

ఓ అండ్ ఎం డివిజన్ నెంబర్ 9: కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరి గుట్టలో తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది.

ఓ అండ్ ఎం డివిజన్ నెంబర్.15: ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, దీప్తి శ్రీ నగర్, మదీనా గూడ, మియాపూర్.

ఓ అండ్ ఎం డివిజన్ నెంబర్. 24: బీరంగూడ, అమీన్ పూర్.

ఈ ప్రాంతాల్లో ప్రజలు అసౌకర్యం కలగకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ అండ్‌ ఎస్‌బీ ఒక పత్రికా ప్రకటనలో కోరింది. పనులు ముగిసిన వెంటనే నీటిని అందించనుంది. ఏదైతే నీటి సరఫరా అంతరాయం ఏర్పండుతుందో ఆ కాలనీలవారు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+