హోం అన్నారు గానీ..చివరికి ఇలా సర్దారు: అజర్ భాయ్ కు కేటాయించినవి ఇవే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ అజరుద్దీన్ కు శాఖలు కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు శాఖలు మాత్రమే ఆయన చేతికి దక్కాయి. హోం మంత్రిత్వ శాఖను అజరుద్దీన్ కు అప్పగిస్తారంటూ మొదట్లో ప్రచారం జరిగినప్పటికీ.. అది రివర్స్ అయింది.

అజారుద్దీన్‌కు మైనార్టీ సంక్షేమ శాఖ‌, దాని అనుబంధ విభాగాలతో పాటు ప‌బ్లిక్ ఎంట‌ర్ ప్రైజెస్ శాఖలు కేటాయించారు. పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ కు ప్రస్తుతం ఫలాన మంత్రి అంటూ ఎవరూ లేరు. ఇది ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉంది. పెట్టుబడులకు సంబంధించిన అంశం కావడం వల్ల స్వయానా రేవంత్ రెడ్డి దీన్ని పర్యవేక్షిస్తూ వస్తోన్నారు. తాజాగా ఈ శాఖను అజరుద్దీన్ కు కేటాయించారు.

These Portfolios allocated to Minister Md Azharuddin

రెండోది- మైనారిటీ సంక్షేమ మంత్రిత్వ శాఖ. దీని ఆధీనంలో ఉండే ఇతర విభాగాలు, కార్పొరేషన్లన్నింటినీ కూడా అజరుద్దీనే పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం ఈ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతిలో ఉంది. ఆయన నుంచి తప్పించి.. అజరుద్దీన్ కు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు జీఓ జారీ చేశారు.

ఈ నెల 31వ తేదీన అజారుద్దీన్ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయన చేరికతో కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఇవి కాకుండా మరో రెండు మంత్రి ప‌ద‌వులు ఇంకా ఖాళీగానే ఉంటోన్నాయి. ఎవరికీ కేటాయించని శాఖలను ఆటోమేటిక్ గా ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తారు. మైనారిటీ కావడం వల్ల హోం మంత్రిత్వ శాఖ అజర్ చేతికి వస్తుందనే ప్రచారం ముమ్మరంగా సాగింది గానీ అది వాస్తవరూపాన్ని దాల్చలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ శాఖను మైనారిటీ నాయకుడే పర్యవేక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+