ఎన్నికల శిక్షణకు రానని మొరాయించిన అదికారులు..! గైర్హాజరైనవారికి షోకాజు నోటీసులు..!!
హైదరాబాద్ : ఇక్కడైనా బస్సులు, ఆటోలు, టూవీలర్లు మొరాయిస్తుంటాయి. కాని ఇక్కడ ప్రభుత్వ అదికారులు మొరాయంచారు. చదవడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అది ఎక్కడో మారుమూల పల్లెటూర్లో జరిగిందంటే సరేలే అనుకువోచ్చు.
కాని నగరం నడిబొడ్డున నిర్వహించిన శిక్షణకు రాకుండా కూర్చున్నారు అదికారులు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు గాను హైదరాబాద్ జిల్లాలో 17, 18 తేదీలలో నిర్వహించిన శిక్షణకు హాజరుకాని ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు షోకాజు నోటీసులు జారీచేస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ ఎం.డి దానకిషోర్ తెలియజేశారు. హైదరాబాద్ జిల్లాలో పిఓ, ఏపిఓ విధులు నిర్వహించడానికి మొత్తం 10వేల మంది ఉద్యోగులకు ఎన్నికల విధుల ఉత్తర్వులు జారీచేయగా 17, 18 తేదీలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి 7వేల మందికి పైగా మాత్రమే హాజరయ్యారని, గైర్హాజరైనవారికి నోటీసులు జారీచేశామని తెలపారు.

17, 18 తేదీలలో హాజరుకాని ఉద్యోగులకు మరో ఛాన్స్ ఇచ్చేందుకు ఉన్నతాదికారులు సమాలోచను జరిపారు అందులో భాగంగా ఈ నెల 22వ తేదీన సికింద్రాబాద్ హరిహరకళాభవన్‌లో మరోసారి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల శిక్షణకు హాజరుకానివారు 22వ తేదీన తప్పనిసరిగా హాజరుకావాలని అన్నారు.
ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి వస్తున్నారని, ఎట్టిపరిస్థితులోనూ మినహాయింపు కుదరదని ్పష్టం చేశారు. ఎన్నికల విధులకు హాజరుకానివారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కఠిన చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications