టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇంట్లో దొంగలు... చోరీకి విఫలయత్నం...

సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇంట్లో గుర్తు తెలియని దుండగులు దోపిడీకి యత్నించారు. కౌటాల మండల కేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే కోనప్ప ఇంట్లో బుధవారం(నవంబర్ 4) రాత్రి దొంగలు చోరీకి విఫల ప్రయత్నం చేశారు. కోనప్ప కుటుంబం వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో... డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో వస్తువులేవీ చోరీకి గురికాలేదని తెలుస్తోంది.

కాగా,ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ ఏడాది అగస్టులో కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు అమెరికా వెళ్లి వచ్చిన ఆయన క్వారెంటైన్ నిబంధనలు పాటించట్లేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చినప్పటికీ క్వారెంటైన్‌కు వెళ్లకుండా పలు శుభాకార్యాల్లో,సమావేశాల్లో పాల్గొన్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు కలెక్టర్ జోక్యంతో ఎమ్మెల్యే క్వారెంటైన్‌లోకి వెళ్లారు.

thieves attempt to theft in trs mla koneru konappa house

గతంలో విధుల్లో ఉన్న ఫారెస్ట్ రేంజర్ అనితపై ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు కృష్ణారావు,ఆయన అనుచరుల దాడి రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. అటవీ భూముల స్వాధీనం కోసం వెళ్లిన అధికారులపై వారు దాడికి పాల్పడ్డారు. కాగజ్‌నగర్‌లోని సార్సాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. రిజర్వ్ ఫారెస్టును ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతోనే అధికారులపై దాడి చేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ ఘటనపై టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో దాడికి పాల్పడిన కృష్ణ జడ్పీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+