దొంగల ఘాతుకం: ఫాంహౌజ్‌లో చోరీకి వచ్చి బాలికపై రేప్ చేశారు
హైదరాబాద్: నగర శివారులోని గండిపేట సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో శుక్రవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు దారుణానికి పాల్పడ్డారు. కత్తులతో బెదిరించి ఓ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం గండిపేట సమీపంలోని కోకాపేట గ్రామానికి చెందిన గూజహిల్స్‌లోని అమృతానంద నిలయం ఫాంహౌస్‌లో మనోజ్‌కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన కుటుంబసభ్యులతో నివాసముంటున్నారు. అయితే ప్రతి రోజు మాదిరిగానే ఫాంహౌస్ శుక్రవారం రాత్రి భోజనం చేసి నిద్రపోయారు.
కాగా, మనోజ్‌కుమార్ భార్య అక్క కూతురు (11) ఐదవ తరగతి చదువుతోంది. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు గుర్తుతెలియని యువకులు నిచ్చెన సహాయంతో మనోజ్‌కుమార్ ఇంట్లోకి ప్రవేశించి రెండు ల్యాప్‌టాప్‌లతో పాటు విలువైన మూడు సెల్‌ఫోన్లు దొంగలించుకుని తీసుకవెళ్తుండగా శబ్దం వచ్చింది.

ఈ క్రమంలో మనోజ్‌కుమార్ భార్య అక్క కూతురు దొంగలు అని గ్రహించి కేకలు పెట్టింది. దీంతో వెంటనే మనోజ్‌కుమార్ నిద్రలేచి బయటి వచ్చేందుకు ప్రయత్నించగా అప్పటికే దొంగలు తెలివిగా మనోజ్‌కుమార్ రూమ్ తలుపు గొళ్లెం పెట్టేశారు. దీంతో మనోజ్‌కుమార్ బయటికి రాలేకపోయ్యాడు.
దొంగలు చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కి దుప్పటిలో చుట్టుకుని గేటు బయటికి తీసుకువెళ్లారు. అప్పటికే మనోజ్‌కుమార్ కూడా గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్నవాళ్లు వచ్చి తలుపు గొళ్లెం తీశారు. కాగా, అప్పటికే ఆ చిన్నారిపై దొపిడీ దొంగలు అత్యాచారానికి పాల్పడి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని జరిగిన సంఘటన వివరాలను తెలుసుకున్నారు. అత్యాచారానికి గురైన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వేయాలని రాజేంద్రనగర్ వాసులు డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications