దొంగల బీభత్సం: 2ఏటిఎంల్లో చోరీ, మరో ఏటిఎంకు నిప్పు, 3లక్షల నగదు దగ్ధం(పిక్చర్స్)
మెదక్: జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఒకేసారి మూడు ఏటిఎంలపై దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు. గ్యాస్ కట్టర్లతో మెషీన్‌ను తొలగించే క్రమంలో మంటలు చెలరేగి మెదక్ ఎస్‌బిఐ ఏటిఎంలో సుమారు 3 లక్షల రూపాయలకుపైగా కరెన్సీ నోట్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయతే పోలీసులు కానీ, బ్యాంకు అధికారులు కానీ ఈ విషయమై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.
అలాగే, జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పాత బస్టాండ్ ఆవరణలో ఉన్న ఇండీ క్యాష్ ఏటిఎంను గుర్తు తెలియని దొంగల ముఠా ధ్వంసం చేసింది. ఈ ఏటిఎం నుంచి 3.21 లక్షల రూపాయలు అపహరించుకుపోయారని డిఎస్పీ తిరుపతన్న వెల్లడించారు.
కౌడిపల్లిలోని ఎస్‌బిఐ ఏటిఎంను లూటీ చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. చోరీకి ప్రయత్నించిన సమయంలో ఏటిఎంలో సుమా రు 8 లక్షల రూపాయలు ఉన్నాయి. డబ్బు భద్రంగా ఉందని తెలుసుకున్న బ్యాంకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, మెదక్, నిజామాబాద్ జిల్లాలో ఏటిఎంలలో చోరీలకు పాల్పడింది మహారాష్ట్ర ముఠాలేనని నిర్ధారణకు వచ్చినట్లు ఐజి నవీన్‌చంద్ తెలిపారు. పోలీసులు అలర్ట్‌గా ఉండి వెంబడించినప్పటికీ వారు దొరకలేదన్నారు. త్వరలోనే వారిని పట్టుకొని తీరుతామన్నారు.

దొంగల బీభత్సం
మెదక్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఒకేసారి మూడు ఏటిఎంలపై దోపిడీ దొంగలు విరుచుపడ్డారు.

దొంగల బీభత్సం
గ్యాస్ కట్టర్లతో మెషీన్‌ను తొలగించే క్రమంలో మంటలు చెలరేగి మెదక్ ఎస్‌బిఐ ఏటిఎంలో సుమారు 3 లక్షల రూపాయలకుపైగా కరెన్సీ నోట్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయతే పోలీసులు కానీ, బ్యాంకు అధికారులు కానీ ఈ విషయమై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.

కాలిపోయిన కరెన్సీ నోట్లు
అలాగే, జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పాత బస్టాండ్ ఆవరణలో ఉన్న ఇండీ క్యాష్ ఏటిఎంను గుర్తు తెలియని దొంగల ముఠా ధ్వంసం చేసింది.

దొంగల బీభత్సం
ఈ ఏటిఎం నుంచి 3.21 లక్షల రూపాయలు అపహరించుకుపోయారని డిఎస్పీ తిరుపతన్న వెల్లడించారు.












Click it and Unblock the Notifications