ఆ తర్వాతే ఫ్రంట్,కెటిఆర్‌ను సీఎం చేస్తే తప్పా, లోకేష్‌కు ఏం అర్హత ఉంది: లక్ష్మీపార్వతి

హైదరాబాద్: రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన తర్వాత దేశ రాజకీయాల్లోకి తెలంగాణ సీఎం కెసిఆర్ అడుగు పెడితే ప్రయోజనం ఉంటుందని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీల నేతల మధ్య ఎవరు గొప్ప అనే కారణాలతో మూడో ఫ్రంట్‌లు విచ్చిన్నమైన సందర్భాలున్నాయని ఆమె గుర్తు చేశారు.

తెలంగాణ సీఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో దృష్టి సారించాలనే అభిప్రాయంతో ఉన్నారు. కాంగ్రెస్, బిజెపికి వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కెసిఆర్ భావిస్తున్నారు.

ఈ తరుణంలో మూడో ఫ్రంట్ ఏర్పాటు అంశంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గతంలో చోటు వచ్చిన మూడో ఫ్రంట్‌లు ఎందుకు గద్దె దిగాల్సి వచ్చిందనే అంశాలను ఆమె ప్రస్తావించారు.

మూడో ఫ్రంట్ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు

మూడో ఫ్రంట్ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చిన తర్వాత దేశ రాజకీయాలపై తెలంగాణ సీఎం కెసిఆర్ దృష్టి కేంద్రీకరిస్తే ప్రయోజనం ఉంటుందని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. గతంలో కూడ కాంగ్రెస్, బిజెపికి వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ ఏర్పాటైన విషయాన్ని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు.ఎన్టీఆర్ హయంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. నేషనల్ ప్రంట్ హయంలో విపి సింగ్ ప్రధానమంత్రిగా పనిచేశారని ఆమె చెప్పారు. అయితే ప్రాంతీయ పార్టీల నేతల మథ్య వ్యక్తిగత ఇగోలతో కూటములు విచ్చిన్నమయ్యాయని చెప్పారు..తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బలోపేతం చేసిన తర్వాత దేశ రాజకీయాల్లోకి కెసిఆర్ వెళ్తే ప్రయోజనంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

జాతీయ పార్టీలు లేకపోతే ఇబ్బందులు

జాతీయ పార్టీలు లేకపోతే ఇబ్బందులు


కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మూడో ఫ్రంట్‌లో జాతీయ పార్టీలు లేకపోతే ప్రాంతీయ పార్టీలతో ఆ ఫ్రంట్ నడవడం అనుకొన్న సాధ్యం కాదని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీల నేతలను సమన్వయం చేయడం తలకు మించిన భారంగా మారే అవకాశం లేకపోలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

కేంద్రం పెత్తనాన్ని నిరసిస్తూ ఫ్రంట్

కేంద్రం పెత్తనాన్ని నిరసిస్తూ ఫ్రంట్


కేంద్రం నుండి రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో చోటు చేసుకొంటున్న అన్యాయాన్ని తెలంగాణ సీఎం కెసిఆర్ నిరసిస్తున్నారని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి అభిప్రాయపడ్డారు.తెలంగాణ రాష్ట్రానికి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర పథకాలకు కేంద్రం నుండి నిధుల కేటాయింపు విషయంలో న్యాయం జరగడం లేదనే విషయాన్ని కెసిఆర్ చెబుతున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

కెటిఆర్ కోసమే ఫ్రంట్

కెటిఆర్ కోసమే ఫ్రంట్


తెలంగాణ సీఎంగా కెటిఆర్‌ను చేసేందుకే కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే యోచన చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. కెటిఆర్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే ఎవరూ కూడ అభ్యంతరం చెప్పే అవకాశం ఉండకపోవచ్చన్నారు. కెటిఆర్ ను సీఎం చేస్తే తప్పేమీటని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ శిష్యుడు, బాబు వద్ద పనిచేశాడని ఆమె గుర్తు చేశారు.లోకేష్‌కు ఏం అర్హత ఉందని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమైన మూడు మంత్రి పదవులను కట్టబెట్టారని ఆమె ప్రశ్నించారు. లోకేష్ తో పోలిస్తే కెటిఆర్ సమర్ధవంతంగా పనిచేస్తాడని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+