రాజా సింగ్‌కు ఈ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్: సీఎం రేవంత్ నెంబర్ ఇచ్చానన్న ఎమ్మెల్యే
హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పలు నంబర్ల నుంచి చంపుతామంటూ ఫోన్లు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నెంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఈ బెదిరింపు కాల్స్ తనకు కొత్తేమీ కాదని.. వీటిపై గతంలో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఒక బాధ్యత గల పౌరుడుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఎక్స్‌లో తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ లేఖ రాశారు.

గతంలోనూ రాజాసింగ్‌ను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపు కాల్స్ చేశారు. పాకిస్థాన్ నుంచి ఆ కాల్స్ వస్తున్నాయంటూ రాజాసింగ్ వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు వచ్చిన కాల్స్‌పై అప్పటి డీజీపీ అంజన్‌కుమార్ యాదవ్‌కు ఫిర్యాదు కూడా చేశారు.
Once again, I'm receiving death threats from multiple numbers today.
— Raja Singh (Modi Ka Parivar) (@TigerRajaSingh) May 29, 2024
This isn't the first time I've been targeted with such threats. Despite previous complaints, it seems no action will be taken.
Nonetheless, as a responsible citizen, I feel obligated to inform the police… pic.twitter.com/exIFElcrUx
'మరోసారి, ఈరోజు నాకు అనేక నెంబర్ల నుంచి హత్య బెదిరింపులు వస్తున్నాయి. నేను ఇలాంటి బెదిరింపులకు గురికావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అయినప్పటికీ, బాధ్యతాయుతమైన పౌరుడిగా, నేను పోలీసులకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నాను' అని రాజా సింగ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
సీఎం రేవంత్ నెంబర్ ఇచ్చా
తనకు బెదిరింపు కాల్స్ చేసిన వారికి తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇచ్చానని రాజాసింగ్ తెలిపారు. ముఖ్యమంత్రి నెంబర్ ఇవ్వడానికి గల కారణాలను ఆయన వెల్లడించారు. రేవంత్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వెళితే... బెదిరింపులకు పాల్పడిన వారిపై ఆయన చర్యలు తీసుకుంటారనే ఉద్దేశ్యంతో ఆ నెంబర్ ఇచ్చానని తెలిపారు.
తనకు ఫోన్ చేసి బెదిరించినవాళ్లు తన వద్ద ఎన్ని నెంబర్లు ఉన్నాయని అడిగారని... అప్పుడే తాను ఇంకో నెంబర్ ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చినట్లు రాజా సింగ్ చెప్పారు. ధర్మం కోసం పని చేస్తే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications