తాగుబోతులు: భయపెట్టి బాలికపై అరు నెలలుగా రేప్
హైదరాబాద్: భయపెట్టి ఆరు నెలలుగా ఓ బాలికపై అత్యాచారం చేస్తున్న ముగ్గురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని భవానీనగర్ పోలీసులు వారిని సోమవారం అరెస్టు చేశారు. నిందితులు హైదరాబాదు పాతబస్తీలో తలాబ్ కట్టకు చెందినవారు.
సయ్యద్ అబ్దుల్ హమీద్, షేక్ యూనుస్, మహమూద్ ఫీర్‌దౌస్ హుస్సేన్ అనే ముగ్గురు మద్యానికి కూడా బానిసలయ్యారు. వారు వంటలు చేస్తూ జీవించేవారు. తమ సమీపంలో ఉండే ఓ బాలికను బెదిరించి వారు అరు నెలలుగా వరుసగా ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చారు.

బాధితురాలికి తల్లి లేదు. తండ్రి యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కడుపు నొప్పితో బాధపడుతున్న కూతురిని తండ్రి ఆస్పత్రికి తీసుకుని వెళ్లి పరీక్ష చేయించాడు. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తేల్చారు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications