హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోదరుల ఘాతుకం: యువతిపై నెలల పాటు రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మూగ, చెవిటి యువతిపై ముగ్గురు అన్నదమ్ములు లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాదులోని పాతబస్తీలో జరిగింది. ఆ లైంగిక దాడితో యువతి గర్భం దాల్చింది. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి బాధితురాలి తల్లికి డబ్బులు ముట్టజెప్పి తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నించారు.

విషయం బయటపడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాదులోని కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన హాతిజా అలియాస్ సాజిదాబేగం, నయీమొద్దీన్ దంపతులకు కూతురు (20) ఇదే ప్రాంతంలో నివసించే మహ్మద్ ఇర్ఫానుద్దీన్ (25), ఇమ్రానుద్దీన్(24), పర్హానుద్దీన్(20) ఇంట్లో పని చేస్తోంది.

Three brothers rapes house maid

అయితే, యువతికి చెవులు వినిపించకపోవడం, మాటలు రాకపోవడంతో ఆ ముగ్గురు అవకాశంగా తీసుకున్నారు. దీంతో యువతిని బెదిరించి కొన్ని నెలల నుంచి లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తామని వారు సైగలతో బెదిరించడంతో భయంతో ఎవరికీ చెప్పుకోలేదు.

ఈ క్రమంలో యువతి ప్రవర్తనలో మార్పు రావడం, అనారోగ్యానికి గురికావడంతో ఇటివలే తల్లి ఆ యువతిని వైద్యశాలకు తీసుకెళ్లింది. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు యువతి రెండు నెలల గర్భిణిగా తేల్చారు. యువతి పని చేసిన ఇంటి యాజమని వద్దకు వెళ్లి నిలదీశారు. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి పంపించేందుకు వారు శతవిధాలా ప్రయత్నించారు. కానీ వారు అందుకు అంగీకరించలేదు.

బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన ఆ ముగ్గురు కామాంధులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. కేసును బహదూర్‌పురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A girl has been raped in old city of Hyderabad by three brothers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X