విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా 3 రోజులు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇప్పటికే దసరా సెలవుల్లో ఫుల్ ఎంజాయ్ గా గడిపిన విద్యార్థులు ఇప్పుడు స్కూళ్లు, కాలేజీల బాట పట్టారు. అయితే వచ్చే వారంలో మరోసారి వారికి హాలీడేస్ రానున్నాయి. వచ్చే వారం వరుసగా మూడు రోజులు పాఠశాలలు, కాలేజీలకు సెలవులు రానున్నాయి. స్కూళ్లు, కాలేజీలు మాత్రమే కాకుండా పలు సాఫ్ట్ వేర్ కంపెనీలకు కూడా శనివారం, ఆదివారం సెలవులు ఉండనున్నాయి. ఆ తర్వాతి రోజు సోమవారం(అక్టోబర్ 20) దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతుతాయి. ఈ క్రమంలో మరోసారి విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ప్లాన్స్ చేసుకుంటున్నారు. దీపావళిని సొంతూళ్లలో ఎంజాయ్ చేసుకునేందుకు ఇప్పటి నుంచే టికెట్ కొనుగోళ్లు ప్రారంభించారు.
దసరా పండుగ సెలవులు పూర్తి చేసుకుని బడి బాట పట్టిన విద్యార్థులకు వచ్చేవారం వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. వచ్చేవారం శనివారం, ఆదివారం అన్ని పాఠశాలలు, కాలేజీలు, పలు సాఫ్ట్ వేర్ కంపెనీలకు సెలవులు ఉండనున్నాయి. అలాగే సోమవారం అంటే అక్టోబర్ 20 వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా సెలవు రానుంది. దీంతో విద్యార్థులకు వరుసగా 3 రోజులు సెలవులు వచ్చినట్లుగా చెప్పుకోవచ్చు. దీపావళి పండుగను సొంతూళ్లలో గ్రాండ్ గా చేసుకునేందుకు టికెట్ బుకింగ్స్ చేసుకుంటున్నారు.
ఇక దీపావళి పండుగను భారత్ లో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. దివాళి నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లోని పాఠశాల విద్యార్థులకు 5 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ కాలంలో అనేక పాఠశాలలు, కొన్ని కళాశాలలు కూడా మూసి ఉండనున్నాయి. ఈ నెలలోనే విద్యార్థులకు ఎక్కువ శాతం సెలవులు వచ్చాయి. ఈ నెల నవమి, దసరా సెలవులతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత వాల్మీకి జయంతి సందర్భంగా అనేక రాష్ట్రాల్లో సెలవు దినంగా ప్రకటించారు. తాజాగా దీపావళి సమీపిస్తున్న క్రమంలో విద్యార్థులకు మరోసారి సెలవులు రానున్నాయి.

దీపావళి పండుగ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోంది. ఈ దివ్వెల పండుగను జాతి, కుల, మత, వర్గ విభేదాలు లేకుండా యావత్ భారతావని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది. నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం ద్వారా మనకు తెలుస్తోంది. దీపావళి పండుగ ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు.












Click it and Unblock the Notifications