హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మానవ అక్రమ రవాణా కేసు: జగ్గారెడ్డికి 3రోజుల కస్టడీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మానవ అక్రమ రవాణా కేసులో ఇటీవల అరెస్టైన కాంగ్రెస్‌నేత తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి)ని మూడు రోజుల పోలీస్‌ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. పది రోజులు జగ్గారెడ్డిని కస్టడీకి ఇవ్వాలని మార్కెట్‌ పోలీసులు కోరగా.. న్యాయమూర్తి మూడు రోజులకు అనుమతిచ్చారు.

సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు విచారణకు అనుతించారు. జగ్గారెడ్డి న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించినట్లు జగ్గారెడ్డి తరఫు న్యాయవాది తెలిపారు. బుధవారం ఉదయం జగ్గారెడ్డిని సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.

మానవ అక్రమ రవాణా?: ఆ ఫ్యామిలీని అమెరికాలోనే వదిలేశారు, జగ్గారెడ్డి అరెస్ట్ మానవ అక్రమ రవాణా?: ఆ ఫ్యామిలీని అమెరికాలోనే వదిలేశారు, జగ్గారెడ్డి అరెస్ట్

Three days custody for jagga reddy in human trafficking case

గుజరాత్‌కు చెందిన ముగ్గురిని తన కుటుంబ సభ్యులుగా పేర్కొంటూ జగ్గారెడ్డి అమెరికా తీసుకెళ్లాడని ఫిర్యాదు అందటంతో సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, కక్ష సాధింపు చర్యలో భాగంగానే టీఆర్ఎస్ సర్కారు ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

English summary
Three days custody for jagga reddy in human trafficking case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X