రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం: డిసిఎం వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి
హైదరాబాద్: హైదరాబాదు రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం సంభవించింది. హైదరాబాదులోని అప్పా జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో రోడ్డుపై ఆగివున్న డీసీఎం వ్యాన్‌ను వేగంగా వచ్చిన లారీ ఢీకొంది.
ఈ ప్రమాదంలో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులను అజగర్, బాబుజాని, రాజులుగా గుర్తించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రెండు వాహనాల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు.

ఎటిఎం చోరీకి విఫలయత్నం
ఇదిలావుంటే, కరీంనగర్ జిల్లాలోని గంగాధర చౌరస్తాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్) ఏటీఎంలో చోరికి విఫలయత్నం జరిగింది. ఎస్‌బీహెచ్ ఏటీఎంలో ఈ నెలలో దుండగులు చోరికి యత్నించడం ఇది రెండోసారి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బుధవారం ఎటిఎం కేంద్రంలోకి ప్రవేశించిన దుండగులు చోరీకి ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో ఎటిఎంను ధ్వంసం చేసి పారిపోయారు. గురువారంనాడు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం సమీపంలోని సిసి కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications