‘హెర్బల్ ఆయిల్’ అంటూ 36లక్షల టోకరా: మహారాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, రూ.3లక్షలు సీజ్(పిక్చర్స్)
హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్‌లో బిమేక్టిన్ అనే హెర్బల్ ఆయిల్ ధర రూ. లక్షల్లో పలుకుతుందని నమ్మిస్తూ అమాయకులను మోసం చేస్తున్న మహారాష్ట్ర గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితుల నుంచి రూ. 3.04లక్షల నగదు, ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకుల చెక్‌బుక్స్ 32, 8నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులు, కొన్ని ఫొటోలు, పాన్‌కార్డులు, రబ్బరు స్టాంపులు, కొన్ని సంస్థల పేరుతో ఉన్న డాక్యుమెంట్లు, గుర్తింపు కార్డులు, 9సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు సీసీఎస్ జాయింట్ సీసీ ప్రభాకర్‌రావు గురువారం తన కార్యాలయలో మీడియాకు వివరాలు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన డేవిడ్ నరోన్హాను కొద్ది నెలల కిందట కైరా జాస్టిన్ అనే మహిళ(యూఎస్‌ఏ) ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. యూఎస్‌ఏలో బిమేక్టిన్ హెర్బల్ ఆయిల్‌కు మంచి గిరాకీ ఉందని తెలిపింది.
లీటర్ ఆయిల్ రూ. 14,500 వస్తుందని, ఆ ఆయిల్‌ను ఈ దేశంలో విక్రయిస్తే లక్షల రూపాయలు వస్తాయంటూ నమ్మించింది. ముంబైకి చెందిన ఎస్‌కే మార్ట్ ట్రేడింగ్ గ్రూప్ నిర్వాహకుడు రాజ్‌ను సంప్రదించాలని సూచించింది. ఆమె మాటలు నమ్మిన డేవిడ్.. రాజ్‌తో మాట్లాడాడు.
ఆయిల్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. తొలుత రూ. 14,500 బ్యాంకు ద్వారా తీసుకొని లీటర్ హెర్బల్ ఆయిల్ కొరియర్ ద్వారా పంపించారు. ఇది శాంపిల్ మాత్రమే.. పది లీటర్ల ఆయిల్ తీసుకుంటే మార్కెట్‌లో రూ. లక్షలు సంపాదించవచ్చని రాజ్ చెప్పాడు. ఈ ఆయిల్ ఎందుకు తీసుకుంటారని బాధితుడు అడగ్గా.. ఇది హెర్బల్ ఆయిల్, వైద్య రంగంలో కీలకమని సూచించారు.
ముగ్గురు నిందితులు బాధితుడికి ఫోన్ చేసి, వేర్వేరు కంపెనీల పేరుతో మాట్లాడుతూ.. ఆయిల్ కొనుగోలు చేస్తామంటూ నమ్మించారు. నిందితుల మాటల గారడిలో చిక్కుకున్న బాధితుడు హెర్బల్ ఆయిల్ వ్యాపారం కోసం దశల వారీగా రూ. 36,19,100 బ్యాంకు ద్వారా చెల్లించాడు. ఆ తర్వాత నిందితుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
వెంటనే జరిగిన సంఘటనపై బాధితుడు డేవిడ్ సీసీఎస్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. కొరియర్ సంస్థ ఇచ్చి రిసిప్టు ఆధారంగా సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముంబయిలో ఉంటున్న ముగ్గురు నిందితులను గుర్తించారు. పథకం ప్రకారం నిందితులు ముగ్గురు జాన్ డీ సౌజా, హేమంత్ అనంత్ గోటాడ్, అమోల్ బాబన్‌రావు మోహిత్ కలిసి హెర్బల్ ఆయిల్ పేరుతో కొంతకాలంగా జనాన్ని మోసం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
వేర్వేరు పేర్లుతో పరిచయం చేసుకుంటూ జనం నుంచి వ్యాపారం ముసుగులో డబ్బులు దండుకుంటుకుంటున్నారని తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి నగదు, కొన్ని వస్తువులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు జాయింట్ కమిషనర్ ప్రభాకర్‌రావు తెలిపారు.

మహారాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్
అంతర్జాతీయ మార్కెట్‌లో బిమేక్టిన్ అనే హెర్బల్ ఆయిల్ ధర రూ. లక్షల్లో పలుకుతుందని నమ్మిస్తూ అమాయకులను మోసం చేస్తున్న మహారాష్ట్ర గ్యాంగ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

మహారాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్
ముగ్గురు నిందితుల నుంచి రూ. 3.04లక్షల నగదు, ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకుల చెక్‌బుక్స్ 32, 8నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులు, కొన్ని ఫొటోలు, పాన్‌కార్డులు, రబ్బరు స్టాంపులు, కొన్ని సంస్థల పేరుతో ఉన్న డాక్యుమెంట్లు, గుర్తింపు కార్డులు, 9సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్
ఈ మేరకు సీసీఎస్ జాయింట్ సీసీ ప్రభాకర్‌రావు గురువారం తన కార్యాలయలో మీడియాకు వివరాలు తెలిపారు.

మహారాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్
హైదరాబాద్‌కు చెందిన డేవిడ్ నరోన్హాను కొద్ది నెలల కిందట కైరా జాస్టిన్ అనే మహిళ(యూఎస్) ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. యూఎస్‌ఏలో బిమేక్టిన్ హెర్బల్ ఆయిల్‌కు మంచి గిరాకీ ఉందని తెలిపింది.

మహారాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్
లీటర్ ఆయిల్ రూ. 14,500 వస్తుందని, ఆ ఆయిల్‌ను ఈ దేశంలో విక్రయిస్తే లక్షల రూపాయలు వస్తాయంటూ నమ్మించింది.

మహారాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్
ముంబైకి చెందిన ఎస్‌కే మార్ట్ ట్రేడింగ్ గ్రూప్ నిర్వాహకుడు రాజ్‌ను సంప్రదించాలని సూచించింది. ఆమె మాటలు నమ్మిన డేవిడ్.. రాజ్‌తో మాట్లాడాడు. ఆయిల్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. తొలుత రూ. 14,500 బ్యాంకు ద్వారా తీసుకొని లీటర్ హెర్బల్ ఆయిల్ కొరియర్ ద్వారా పంపించారు












Click it and Unblock the Notifications