పేరుకు బేకరీ.. లోపల 'పోర్న్' దందా: అశ్లీల సీడీల బాగోతం బట్ట బయలు..
పైకి చూడటానికి అదో బేకరీ లాగా కనిపించినా.. లోపల మాత్రం అశ్లీల చిత్రాలకు సంబంధించిన వ్యాపారం జరుగుతోంది.
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అశ్లీల సీడీల దందాను పోలీసులు బయటపెట్టారు. ఇందుకోసం ఓ బేకరీని అడ్డాగా మలుచుకుని అక్కడి నుంచే సీడీల విక్రయాలు జరుపుతుండటం గమనార్హం.
పైకి చూడటానికి అదో బేకరీ లాగా కనిపించినా.. లోపల మాత్రం అశ్లీల చిత్రాలకు సంబంధించిన వ్యాపారం జరుగుతోంది. రెండేళ్లుగా ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఎట్టకేలకు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.

శ్రీమహాలక్ష్మి ఫుడ్ వరల్డ్ బేకరీ:
కరీంనగర్‌లోని శాస్త్రి రోడ్డులో ఉన్న శ్రీమహాలక్ష్మి ఫుడ్ వరల్డ్ అనే బేకరీ ఉంది. వావిలాలపల్లికి చెందిన గుర్రం శ్రీపాల్‌రెడ్డి ఈ బేకరీని నడుపుతున్నాడు. ఇదే బేకరీలో శ్రీపాల్ అనుచరుడు కిసాన్‌నగర్‌కు చెందిన పుల్లూరి వినీత్ అశ్లీల చిత్రాల సీడీలు రూపొందిస్తున్నాడు.

ఒక్క సీడీ రూ.150:
బేకరీలోనే ఒక కంప్యూటర్‌ను ఏర్పాటుచేసుకుని పుల్లూరి వినీత్ ఇంటర్‌నెట్ ద్వారా అశ్లీలచిత్రాలను డౌన్‌లోడ్ చేస్తున్నాడు. ఆపై వాటిని సీడీలుగా రూపొందించి దుర్గమ్మగడ్డకు చెందిన మహ్మద్ తాజ్‌తో ఒక్కటి 150 రూపాయలకు విక్రయిస్తున్నారు.

304సీడీలు స్వాధీనం:
ఈ అశ్లీల సీడీల దందాకు సంబంధించిన సమాచారం అందడంతో కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ బృందం, కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కలిసి బేకరీపై దాడులు చేశారు. నిందితులు శ్రీపాల్‌రెడ్డి, వినీత్, తాజ్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక కంప్యూటర్, మానిటర్, హోంథియేటర్, సెల్‌ఫోన్, మెమోరీ కార్డు 304 సీడీలను స్వాధీనం చేసుకున్నారు.

యువతను చెడగొట్టి:
తమ అశ్లీల సీడీల విక్రయాల కోసం నిందితులు చాలామంది యువకులకు గాలం వేసినట్లు తెలుస్తోంది. యువతను చెడు అలవాట్లకు గురిచేసి అడ్డగోలుగా సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ ఆక్ట్ 2000 కింద ముగ్గురు నిందితులపై సుమోటో కేసు నమోదు చేశారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications