హైదరాబాద్: బాత్రూంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు అనుమానాస్పద మృతి

హైదరాబాద్: నగరంలోని సనత్‌​నగర్​‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్​ బాత్​రూంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సనత్‌​నగర్​ జెక్​ కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్టుమెంట్​ రెండో అంతస్తులోని ఫ్లాట్‌​లో ఈ ముగ్గురి మృతదేహాలు ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సనత్​‌నగర్‌​లో జెక్​ కాలనీలోని అపార్టుమెంట్​లో ఆర్.వెంకటేశ్​(55), మాధవి(50), హరి(30) నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చినప్పుడు ఎవరూ కనిపించలేదు. దీంతో బాత్​రూమ్​‌లో ఉన్నారేమోననుకుని ఇంట్లో పనిచేసి వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం 3 గంటల సమయంలో వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఎవరూ కనిపించలేదు.

Three persons suspicious death in Sanath Nagar Hyderabad

ఈ నేపథ్యంలో అనుమానం వచ్చి బాత్​రూమ్​ వైపు చూడగా డోర్​ లాక్​ చేసి ఉంది. అనుమానంతో స్థానికులకు సమాచారం అందించగా అపార్ట్​మెంట్​ వాచ్​‌మెన్​ డోర్​ పగులుగొట్టి చూశాడు. అప్పటికే ముగ్గురు విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే అపార్ట్​మెంట్​ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. తొలుత విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు పోలీసులు భావించారు. కానీ, అలాంటి ఆనవాళ్లు ఏవీ లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత క్లూస్​ టీమ్​ సాయంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+