టిక్‌టాక్ ప్రేమ: పెళ్లికి వీరబాబు నో, పోలీస్‌స్టేషన్లోనే యువతి గొంతు కోసుకుంది!

హైదరాబాద్: నేటి యువతపై సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రోజులో ఎక్కువ భాగం విద్యార్థులు, యువత సోషల్ మీడియాలోనే గడుపుతుండటం గమనార్హం. సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అదే స్థాయిలో చెడు కూడా జరుగుతోంది. తప్పుడు వార్తల ప్రచారం, పరిచయాలు, స్నేహాలు యువతకు ఎక్కువగా నష్టాన్నే మిగులుస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే నగరంలో చోటు చేసుకుంది.

టిక్‌టాక్ పరిచయం ప్రేమగా..

టిక్‌టాక్ పరిచయం ప్రేమగా..

వివరాల్లోకి వెళితే.. లింగంపల్లికి చెందిన యువతి(20)కి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లోని మస్తాన్‌నగర్‌లో నివసించే వీరబాబు(20)తో సోషల్ మీడియా వీడియో షేరింగ్ యాప్ ‘టిక్‌టాక్'లో పరిచయం ఏర్పడింది. మూడు నెలల వీరి పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు.

వీరబాబుకు పెళ్లికి నో చెప్పాడంటూ..

వీరబాబుకు పెళ్లికి నో చెప్పాడంటూ..

అయితే, ఏమైందో ఏమో కానీ, వారం రోజుల క్రితం వీరబాబు తన ప్రేమను కాదన్నడంటూ ఆ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ యువతి, యువకుడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా ఆమెను పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు. ఈ క్రమంలో ఆమె రాజీ పడుతున్నట్లు పోలీసులకు ఇచ్చిన లేఖలో తెలిపింది.

పోలీస్ స్టేషన్లోనే బ్లేడుతో గొంతుకోసుకున్న యువతి..

పోలీస్ స్టేషన్లోనే బ్లేడుతో గొంతుకోసుకున్న యువతి..

కాగా, శనివారం మరోసారి తన తల్లితో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది సదరు యువతి. దీంతో పోలీసులు వీరబాబును పిలిపించారు. ఇద్దరితో పోలీసులు మాట్లాడుతున్న సమయంలోనే తనతో తెచ్చుకున్న బ్లేడుతో ఒక్కసారిగా తన గొంతు కోసుకుంది యువతి. దీంతో అక్కడున్నవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

వీరబాబుతో పెళ్లి చేస్తే చాలు..

వీరబాబుతో పెళ్లి చేస్తే చాలు..

స్వల్ప గాయమే అయ్యిందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. బాధిత యువతి తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని.. వీరబాబుతో పెళ్లి చేయించాలని కోరిందని పోలీసులు తెలిపారు.

ఆత్మహత్య చేసుకుంటా.. వీరబాబుకు వీడియో సందేశం

ఆత్మహత్య చేసుకుంటా.. వీరబాబుకు వీడియో సందేశం

పోలీసులను ఆశ్రయించే ముందే ఆ యువతి ఓ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘నీకన్నా ముందు నేను చనిపోతున్నానని.. తర్వాత నువ్వు ఏమీ చేసుకోవద్దు' అని యువతి.. వీరబాబుకు తెలిపింది. వీరబాబు తనను ఎందుకు పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడో ఆ వీడియోలో యువతి పేర్కొంది. కాగా, వీరబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ పరిణామాలు యువతీయుకుల కుటుంబాల్లో ఆందోళనలకు దారితీశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+