అయిపాయే... టిక్ టాక్ పూర్తిగా బంద్... గుండె పగిలిన బాధలో ఆ స్టార్స్...
వ్యక్తుల సృజనాత్మకతను ప్రోత్సహించడం... వారికి సంతోషం కలిగించడం... అనే కాన్సెప్ట్‌తో మొదలైన టిక్‌టాక్ యాప్ భారత్‌ను ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా 14 స్థానిక భాషలతో అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్‌మెంట్ అందించి... లోకల్‌గా ఎంతోమందికి సెలబ్రిటీ స్టేటస్ తీసుకొచ్చింది. అలాంటి యాప్ ప్రస్థానానికి భారత్‌లో తెరపడింది. సైబర్ సెక్యూరిటీ రీత్యా కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ సహా 59 చైనా యాప్స్‌పై సోమవారం(జూన్ 29) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం నాటికి టిక్ టాక్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
Recommended Video

ఈ సాయంత్రంతో ముగిసిన టిక్ టాక్ ప్రస్థానం...
టిక్‌టాక్‌పై నిషేధం ప్రకటించిన తర్వాత చాలామంది యూజర్స్‌లో గందరగోళం ఏర్పడింది. తక్షణం యాప్‌పై నిషేధం విధిస్తారా.. లేక మరి కొద్దిరోజుల సమయం పడుతుందా అన్న సందేహాలు వారిలో వ్యక్తమయ్యాయి. మంగళవారం కూడా యాప్ ఎప్పటిలాగే పనిచేయడంతో... నిషేధం ఎప్పటినుంచి అమలవుతుందోనన్న డైలామా వారిని వెంటాడింది. కానీ సాయంత్రం సమయానికి యాప్ సేవలు నిలిచిపోవడంతో... ఇక టిక్‌టాక్ ప్రస్థానం ముగిసిపోయిందని ఫిక్స్ అయిపోయారు.

ఇప్పుడు టిక్ టాక్ ఓపెన్ చేస్తే...
మొదట భారత్‌లోని అన్ని సర్వీస్ ప్రొవైడర్లు టిక్ టాక్ యాప్‌ను తొలగించాయి. తాజాగా యాప్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు టిక్ టాక్ యాప్ ఓపెన్ చేస్తే 'నో నెట్‌వర్క్ కనెక్షన్.' అన్న మెసేజ్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతోంది. టిక్ టాక్ యాప్ సర్వర్‌కు ఇంటర్నెట్‌ను నిలిపివేయడంతో దాని సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. టిక్ టాక్ యాప్ ఓపెన్ చేసేవారికి... దానిపై మరో మెసేజ్ కూడా కనిపిస్తోంది. 'డియర్ యూజర్స్,కేంద్ర ప్రభుత్వం విధించిన 59 యాప్స్‌పై నిషేధానికి అనుగుణంగా ఆ ఆదేశాలను పాటిస్తున్నాం. భారత్‌లోని మా వినియోగదారుల గోప్యత,భద్రతకు భరోసా ఇవ్వడం మా అతిపెద్ద ప్రాధాన్యత.' అన్న సందేశాన్ని అక్కడ గమనించవచ్చు.

ఫేస్‌బుక్‌లో ఫన్నీ వీడియోలు...
టిక్ టాక్‌పై నిషేధం నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో ఫన్నీ ఫోటోలు,వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టిక్ టాక్‌లో ఎక్కువగా ఫేమస్ అయిన దుర్గారావు,ఉప్పల్ బాలు,కాగజ్‌నగర్ సాయి,బంజారాహిల్స్ ప్రశాంత్,ఇషా మనోహరి ప్రియ వంటి వాళ్ల ఫోటోలతో యాప్ బ్యాన్‌పై ట్రోల్స్ జరుగుతున్నాయి. యాప్ బ్యాన్ చేయడంతో... ఈ టిక్ టాక్ స్టార్ల గుండె పగిలి ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

టిక్ టాక్ హెడ్ ఏమన్నారు...
టిక్ టాక్ నిషేధంపై ఆ యాప్ ఇండియన్ హెడ్ నిఖిల్ గాంధీ స్పందించారు. 'కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించే ప్రక్రియలో ఉన్నాం. ఇప్పటివరకూ మా భారతీయ యూజర్స్ సమాచారాన్ని చైనాతో సహా ఏ విదేశీ ప్రభుత్వంతో పంచుకోలేదు. ఇక్కడి చట్టాలకు లోబడే యాప్ కార్యకలాపాలను సాగించాం. యూజర్ డేటా ప్రైవసీకి మేము అత్యంత ప్రాధాన్యతనిచ్చాం.తాజా నిషేధంపై ప్రభుత్వంతో మాట్లాడేందుకు మాకు కబురు వచ్చింది.' అని చెప్పుకొచ్చారు.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications