చంద్రబాబు-రాహుల్‌లకు 'ఎగ్జిట్' షాక్: కేసీఆర్‌దే గెలుపు, ఏ సర్వే ఏం చెప్పిందంటే? 90 సీట్లన్న ఓ సర్వే
Recommended Video

హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం ఎన్నికలు గత నెల నవంబర్ నెలలో ముగిశాయి. తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7వ తేదీన (నేడు) ముగిశాయి.
ఎన్నికలు ముగియగానే వివిధ మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేశాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ గెలుస్తుందని పలు సర్వేల్లో తేలింది. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్‌దే అధికారమని పలు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ సర్వే ప్రకారం
టైమ్స్ నౌ సర్వే ప్రకారం తెలంగాణలో ఓటర్లు తెరాస వైపు మొగ్గు చూపారు. ఈ సర్వే ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి 66 సీట్లు, మహాకూటమికి 37 సీట్లు, బీజేపీకి 7 సీట్లు, ఇతరులకు 9 సీట్లు వస్తాయని తేలింది.

రిపబ్లిక్ ఎగ్జిట్ సర్వే ప్రకారం
రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో టీఆర్ఎస్ పార్టీకి 50-65 సీట్లు, మహాకూటమికి 38 నుంచి 52 సీట్లు, బీజేపీకి 4-7 సీట్లు, ఇతరులకు 10 నుంచి 17 సీట్లు వస్తాయని తేలింది.

సీఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ సర్వే ప్రకారం
సీఎన్ఎన్ న్యూస్ 18 సర్వే ప్రకారం తెరాసకు 50 నుంచి 65, మహాకూటమికి 38 నుంచి 52 సీట్లు, బీజేపీకి 4 నుంచి 7 సీట్లు, ఇతరులకు 10 నుంచి 17 సీట్లు వస్తాయని తేలింది.

న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ సర్వే ప్రకారం
2014 ఎన్నికల్లో తెలంగాణ 63 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత దాదాపు 25 మందికి పైగా తెరాసలో చేరారు. ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెరాస బలం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ కలిసినా ఫలితం లేకుండా పోతుందని ఎగ్జిట్ ఫలితాల ద్వారా వెల్లడవుతోంది. బీజేపీ పుంజుకున్నదని తేలింది.

ఇండియా టుడే సర్వే ఎగ్జిట్ సర్వే ప్రకారం
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి 79 నుంచి 91 సీట్లు, మహాకూటమికి 21 నుంచి 33 సీట్లు, బీజేపీకి 1- 3 సీట్లు వస్తాయని తేలింది. మిగతా అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు తెరాసకు బొటాపోటీ సీట్లు వస్తాయని తేల్చగా.. ఇండియా టుడే సర్వే మాత్రం ఏకంగా 80 నుంచి 90 వరకు వస్తాయని తేలడం గమనార్హం.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications