Thinmar Mallanna: కాంగ్రెస్‍లో చేరిన తీన్మార్ మల్లన్న..
చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న(Thinmar Mallanna) కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మల్లన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తీన్మార్ మల్లన్న ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ప్రసారమయ్యే తీన్మార్ కార్యక్రమంతో ప్రజాధారణ పొందారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశారు.
ఆ తర్వాత క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ స్థాపించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు. అంతకుముందు హుజూర్‌నగర్ ఉపఎన్నికలో కూడా తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. మరోసారి ఎమ్మెల్సీ పోటీ చేసిన నవీన్ రెండో సారి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనపై పలు కేసులు నమోదు కావడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా నవీన్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. తీన్మార్ మల్లన్నకు ఏదో ఒక నియోజకవర్గం నుంచి టికెట్ వస్తుందని భావించారు. కానీ ఆయనకు టికెట్ కేటాయించలేదు.

ఈ క్రమంలో మల్లన్నకు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లుగా తెలిసింది. తీన్మార్ మల్లన్న చేరికతో కాంగ్రెస్ లో మరింత జోష్ పెరిగిందని అని చెప్పడంలో నో డౌట్ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. పటాన్ చెరు టికెట్ కాటా శ్రీనివాస్ గౌడ్ కు కేటాయించకపోవడంపై ఆయన అనుచరులు ఆందోళన చేశారు.












Click it and Unblock the Notifications