పిక్చర్స్: ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద చావుడప్పులు

హైదరాబాద్: తమ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరిన శాసనసభ్యులు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగు తమ్ముళ్లు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఆయా ఎమ్మెల్యేల ఇళ్లముందు చావు డప్పు మోగించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

కార్యకర్తలు చీపుర్లు, చెప్పులతో ఆందోళనలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరంగల్‌ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ అర్బన్‌ పార్టీ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు హన్మకొండలో ఆయన ఇంటి ముందు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

శుక్రవారం తెల్లవారు ఝామునే డప్పులు, చెప్పులు, చీపుర్లు చేబూని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నినదించారు. సుమారు గంటపాటు చావుడప్పు మోగిస్తూ ఆందోళన చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేరు. పోలీసులు ఆందోళన చేస్తున్న నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

చావుడప్పులు..

చావుడప్పులు..

హైదరాబాద్‌లోనూ టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని నిరసిస్తూ.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఆధ్వర్యంలో మలక్‌పేట తిరుమల హిల్స్‌లో ఆందోళనకు దిగారు.

చావుడప్పులు..

చావుడప్పులు..

మలక్‌పేటలోని తిరుమల హిల్స్‌లో టీడీపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఇరువర్గాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడిని నిరసిస్తూ శోభారాణి పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నాకు దిగారు.

చావుడప్పులు...

చావుడప్పులు...

టిడిపి నుంచి టిఆర్ఎస్‌లోకి దూకిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ నినదిస్తూ తెలుగుయువత నాయకులు చెప్పులు, చీపుర్లతో ర్యాలీగా తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు.

చావుడప్పులు...

చావుడప్పులు...

టీఆర్‌ఎస్‌లో చేరిన తీగల, మంచిరెడ్డి ఇళ్లను ముట్టడించడానికి వెళ్లిన తెలుగు యువత రాష్ట్ర కన్వీనర్‌ తూళ్ల వీరేందర్‌గౌడ్‌తో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

చావుడప్పులు..

చావుడప్పులు..

సికింద్రాబాదులోని మారెడుపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ రాజీనామా చేయాతలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు.

చావుడప్పులు..

చావుడప్పులు..

తలసాని ఇంటి ముందు చీపుర్లు, బ్యానర్లు పట్టుకుని నిరసన తెలిపారు. టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

చావుడప్పులు...

చావుడప్పులు...

టిఆర్‌ఎస్‌లో చేరిన శాసనసభ్యులకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనల్లో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు గోపీనాథ్‌, ప్రకాశ్‌గౌడ్‌, వివేకానంద, గ్రేటర్‌ పార్టీ అధ్యక్షుడు సి. కృష్ణాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+