ప్రియుడితో జల్సాల కోసం బడాబాబును గాలమేసి పెళ్లిచేసుకుని, ఆపైన దొంగతనాలు చేస్తూ...
హైదరాబాద్: తన ప్రియుడితో కలిసి జల్సా జీవితం అనుభవించేందుకు ఓ యువతి ఏకంగా ఓ బడాబాబుకు గాలమేసి పెళ్లి చేసుకుంది. ఆనక అతడి ఇంటినుంచి ఒక్కో వస్తువునూ దొంగతనం చేస్తూ.. చివరికి దొరికిపోయి కటకటాలపాలైంది.
వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన పావని(28)కి హైదరాబాద్ అంబర్ పేటలో ఉండే కిషోర్ అనే యువకుడికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సట్టా నిర్వహించే కిషోర్‌ను ఇష్టపడిన పావని, అతన్ని పెళ్లిచేసుకోవాలని భావించింది.

ప్రియుడితో జల్సాలు చేయడం కోసం...
తన ప్రియుడైన కిషోర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన పావని ఆ క్రమంలో అతడికి పలుమార్లు డబ్బులు కూడా ఇచ్చింది. ఇద్దరూ కలిసి సట్టా కోసం అప్పుడప్పుడు ముంబై వెళ్లి అక్కడ జల్సా చేసి వస్తుండేవారు. గతంలో కూడా టర్కీ కరెన్సీని సరఫరా చేస్తూ పావని పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లొచ్చింది.

బాగా డబ్బున్న యువకుడికి గాలమేసి...
కొంతకాలానికి డబ్బుల సర్దుబాటు కష్టతరంగా మారడంతో పావని కొత్త ప్లాన్ వేసింది. ఆర్థికంగా బాగా స్థిరపడిన రమేష్ అనే యువకుడికి గాలం వేసింది. అతడు ఆమె ఆకర్షణలో చిక్కుకోగానే అదే అదనుగా రమేష్‌ను పెళ్లి చేసుకుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న రమేష్‌కు దక్షిణాఫ్రికాలో ఉద్యోగం రావడం పావనికి బాగా కలిసొచ్చింది.

డబ్బు కోసం తన ఇంట్లో తానే చోరీలకు పాల్పడి...
ఆ తరువాత పావనికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. తన ప్రియుడైన కిషోర్‌తో కలిసి మళ్లీ జల్సాలు మొదలెట్టింది. ఈ జల్సాలకు అవసరమయ్యే డబ్బుల కోసం పావని తన ఇంట్లోనే పలుమార్లు చోరీలకు పాల్పడింది. ఇలా చోరీల ద్వారా వచ్చిన డబ్బును పావని తీసుకెళ్లి తన ప్రియుడైన కిషోర్‌కు ఇచ్చేది.

ఉమెన్ హాస్టల్లో చేరి, మళ్లీ...
పావని చేస్తున్న పనులను గమనించిన రమేష్ కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోంచి గెంటేశారు. అయినా పావనిలో మార్పు రాలేదు. నకిలీ గుర్తింపు కార్డు చూపించి అమీర్‌పేటలోని ఓ ఉమెన్ హాస్టల్లో చేరి, పలువురు యువతులతో స్నేహం చేసింది.

బండారం ఇలా బయటపడింది...
ఉష అనే యువతి బీరువాలోంచి ఏడు తులాల బంగారం దొంగిలించి, దాన్ని అమ్మి సొమ్ముచేసుకుని ప్రియుడు కిషోర్‌తో కలిసి ముంబై వెళ్లి జల్సా చేసి వచ్చింది. పావనిపై అనుమానం కలిగిన ఉష ఫిర్యాదుతో పోలీసులు జోక్యం చేసుకుని ఈ గుట్టంతా లాగారు. అనంతరం పావనిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications