ఆపత్కాలంలో ఇవే ఆయుధాలు: మహిళలు వీటిని మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి: జీరో ఎఫ్ఐఆర్ ఇలా..!

డాక్టర్ ప్రియాంక రెడ్డి అంశం తరువాత మహిళల భద్రత పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో తొలుత ప్రియాంక కుటుంబ సభ్యులు తొలుత స్థానిక పోలీసు స్టేషన్ కు వెళ్తే తమ పరిధి కాదని చెప్పారనే ఫిర్యాదులు ఉన్నాయి. అయితే, దీనికి సంబంధించి హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో మహిళా భద్రతకు సంబంధించి అందుబాటులో ఉన్న సేవల గురించి అవగాహన కల్పిస్తున్నారు. అదే విధంగా పోలీసు స్టేషన్ లిమిట్స్ గురించి పట్టించుకోకుండా..జీరో ఎఫ్ఐఆర్ అమలు పైనా తెర మీదకు వచ్చింది. దీంతో..ప్రతీ మహిళా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తమ ఫోన్లలో సేవ్ చేసుకోవాల్సిన నెంబర్లు..వినియోగం..అప్రమత్తత..సాయం..ఆపత్కాలంలో బయటపడే విధానం ..

సేవ్ చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్లు..

సేవ్ చేసుకోవాల్సిన ఫోన్ నెంబర్లు..

డయల్‌-100: ఈ నంబరుకు ఫోన్‌ చేస్తే.. కంట్రోల్‌ రూం సిబ్బంది వెంటనే ఫిర్యాదును నమోదు చేసుకుని, సంబంధిత పోలీసు సిబ్బందిని ఘటనాస్థలికి పంపుతారు. వాట్సాప్‌ ఫిర్యాదులకు: 9490616555(హైదరాబాద్‌), 9490617444(సైబరాబాద్‌), 9490617111(రాచకొండ). పోలీసులు 24 గంటలూ ఈ నంబర్లకు వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా పెడతారు. ఔటర్‌పై: ఔటర్‌ రింగ్‌రోడ్‌పై వెళ్తున్నప్పుడు ఆపద వస్తే.. 7901099445 నంబరుకు నేరుగా ఫోన్‌ చేయవచ్చు. వెంటనే ఔటర్‌పై ఉండే పెట్రోలింగ్‌ సిబ్బంది అక్కడికి చేరుకుంటారు. దీంతోపాటు ఔటర్‌పై అక్కడక్కడా ఉండే ‘ఎస్‌వోఎస్‌' ఫోన్‌ బూత్‌లను వాహనాల బ్రేక్‌డౌన్‌, ఫిర్యాదుల కోసం వాడుకోవచ్చు.

‘హాక్‌-ఐ'ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి

‘హాక్‌-ఐ'ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి

మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీసులు విడుదల చేసిన ‘హాక్‌-ఐ' యాప్‌ ఉంటే.. తమనుతాము కాపాడుకునేందుకు చేతిలో ఓ ఆయుధం ఉన్నట్లేనని పోలీసులు చెబుతున్నారు. ఆపదలో ఉన్నప్పుడు.. ఈ యాప్‌లోని బజర్‌ నొక్కితే.. క్షణాల్లో పోలీసులకు సమాచారం అందుతుంది. అదే సమయంలో సైబరాబాద్..హైదరాబాద్..రాచకొండ కమీషనరేట్ల పరిధిలో ఎక్కడ ఏం జరిగినా తెలుసుకే విధంగా వ్యవస్థను తీర్చి దిద్దుతున్నారు. అందులో భాగంగానే మరిన్ని కొత్త విధానాలను అందుబాటులోకి తెస్తున్నారు.

నెంబర్ 112..ఎంతో కీలకం

నెంబర్ 112..ఎంతో కీలకం

మూడు కమిషనరేట్ల పరిధిలో మొబైల్ నుండి 112 కు డయల్ చేయటం ద్వారా సులభతరంగా..వేగంగా పోలీసు సేవలు పొందవచ్చు. పోలీసు వ్యవస్థ ఈ నెంబర్ ను జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానం చేసింది. ఈ నెంబర్ కు కాల్ చేయగానే సమీపంలోని పోలీసు స్టేషన్ లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ మొదలు డీసీపీ స్థాయి వరకు అయిదుగురు పోలీసులకు ఏ సమయంలో చేసినా వెంటనే ఏక కాలంలో కాల్ వెళ్తుంది. అదే విధంగా కుటుంబ సభ్యుల నెంబర్లను అనుసంధానం చేసి ఉండటంతో..వారికి సమాచారం చేరుతుంది. ఇక, సమీపంలో ఈ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న ఉన్న సోషల్ వాలంటీర్లకు కాల్ వెళ్లి వారిని అప్రమత్తం చేస్తుంది. దీంతో..బాధితురాలు ఎక్కడ ఉన్నదీ తెలుసుకోవటంతో పాటుగా..సమీపంలోని పోలీసులు..వాలంటీర్లు సాయం అందించేందుకు ముందుకు వచ్చే అవకాశం కలుగుతుంది. దీనిని త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయనున్నారు.

ఏ స్టేషనల్ అయినా ఫిర్యాదు.. జీరో ఎఫ్ ఐ ఆర్...

ఏ స్టేషనల్ అయినా ఫిర్యాదు.. జీరో ఎఫ్ ఐ ఆర్...

బాధితురాలు ఎక్కడ ప్రమాదం పొంచి ఉన్నా..అందుబాటులో ఉన్న పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చు. దీని పైన మందికి అవగాహన లేదు. నిజానికి చాలా మంది పోలీసులకే తెలీదు. ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు పోలీసుల ధగ్గరికి వెళితే అది మాపరిధి కాదు అని శంషాబాద్ పరిధి అనీ కాదు కాదు శంషాబాద్ రూరల్ పరిధి అనీ తిప్పారనే విమర్శ ఉంది. బాధితులు ఫిర్యాదుతో ఏ పోలిస్ స్టేషన్ కు వెళ్ళినా వారు తప్పకుండా ఆ ఫిర్యాదు తీసుకోవాలి. మా పరిధి కాదు అని వాళ్ళు అంటే జీరో ఎఫ్ ఐ ఆర్ చెయ్యండి అని మనం అడగాలి. అప్పుడు జీరో ఎఫ్ అయి ఆర్ చెయ్యాల్సిందే..దీని ద్వారా మన ఫిర్యాదు ఏ స్టేషన్ పరిధి లోదో తేలనపుడు మనం ఎక్కడైతే ఫిర్యాదు చేసామో అక్కడ జీరో ఎఫ్ ఐ ఆర్ గా నమోదు చేసి తరువాత సంబందిత స్టేషన్ ఏదో తెలుసుకుని ఆ ఎఫ్ ఐ ఆర్ ను ఆ స్టేషన్ కు పోలీసులు బదిలీ చేయాలి...
ఇంకా చెప్పాలంటే ఏ పరిధిలోదో తెలిసినా సరే మనం ఫిర్యాదును వేరే స్టేషన్ లో చేసి జీరో ఎఫైఆర్ చేయండి అని అడిగితే అక్కడ నమోదు చేయాల్సిందే. మా పరిధి కాదు అని ఏ పోలిస్ స్టేషనూ అనడానికి వీలు లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+